జాతీయ అథ్లెటిక్స్‌కు క్రీడాకారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ అథ్లెటిక్స్‌కు క్రీడాకారుల ఎంపిక

Oct 24 2026 9:26 AM | Updated on Oct 24 2026 9:26 AM

కందనూలు: తమిళనాడు రాజధాని చైన్నెలో శుక్రవారం నుంచి మంగళవారం వరకు జరుగుతున్న 41వ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా నుంచి ఐదురుగు విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా అథ్లెటిక్స్‌ కోచ్‌ స్వాములు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు వివిధ విభాగాల్లో సంతోష్‌కుమార్‌, గణేష్‌, దిల్షాన్‌, స్వప్న, శ్రీవల్లి ఎంపికయ్యారన్నారు. విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభకనబరిచి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మహిళా కబడ్డీ జిల్లా

జట్టు ఎంపిక

కల్వకుర్తి రూరల్‌: కల్వకుర్తిలోని మహాత్మ జ్యోతిబా పూలే జూనియర్‌ బాలికల కళాశాల మైదానంలో శుక్రవారం జిల్లా మహిళా కబడ్డీ జట్టును ఎంపిక చేశారు. ఈ నెల 28 నుంచి 30 తేదీ వరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించే 73వ సీనియర్‌ మహిళల కబడ్డీ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో జిల్లా జట్టు పాల్గొంటుంది. ఈ మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరు కాగా.. కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి యాదయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో జట్టును ఎంపిక చేశారు. కార్యక్రమంలో రమేష్‌, మోహన్‌లాల్‌, డాక్య, రామన్‌గౌడ్‌, భారతి, ఖేలో ఇండియా కోచ్‌ సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

మా భూములు ముంచొద్దు

కల్వకుర్తి రూరల్‌: డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పేరుతో పాలమూరు రైతుల భూములు ముంచకుండా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని జేఏసీ చైర్మన్‌ సదానందగౌడ్‌ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు గుండా 300 కి.మీ., కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ 80 ఏళ్లుగా పాలమూరు రైతులు సాగు, తాగు నీళ్ల కోసం ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డిండి ప్రాజెక్టు పేరుతో ఈ జిల్లా భూములను ముంచి నల్లగొండకు నీళ్లు తరలించవద్దని వేడుకున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. ఉమ్మడి జిల్లా రైతుల బతుకులు మారడం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరును కరువు, వలసల జిల్లాగా చేసి నీళ్ల పంపిణీలో తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా రాజకీయ నేతల ఆధిపత్యంతో పాలమూరు రైతుల పొట్ట కొట్టి డిండి ప్రాజెక్టు పేరుతో నీళ్ల దోపిడికి తెరతీశారని దుయ్యబట్టారు. రైతుల పక్షాన ఉద్యమించడానికి ఏ పార్టీ ముందుకు రావడం లేదని, కానీ, ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది రైతులతో ధర్మ సత్యాగ్రహ దీక్ష, రైతుల పాదయాత్ర, ధర్నా కార్యక్రమాలు ప్రభుత్వాన్ని కదిలించేలా చేశాయని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి రావడం జేఏసీ ఉద్యమ విజయమన్నారు. చేసే పనిలో నిజాయితీ, ధర్మం ఉందని ప్రభుత్వం పాలమూరు జిల్లా రైతాంగానికి న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా రైతులకు నాగార్జునసాగర్‌, శ్రీశైలం, గుర్రంపోడు, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించే అవకాశం ఉందని చెప్పారు.

ఉద్దాల తయారీదారులకు చెక్కుల అందజేత

చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఉద్దాలు, చాట, తలియ కుండ తయారీదారులకు శుక్రవారం ఆలయ ప్రాంగణంలో చెక్కులు అందజేశారు. ఆలయ చైర్మన్‌ బత్తుల బాల్‌రాజు, ఈవో మధనేశ్వర్‌రెడ్డి తయారీదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాల ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికి నిర్ణీత సమయంలో ఉద్దాలు, చాట, తలియ కుండలను భక్తిశ్రద్ధలతో తయారు చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement