లింగాల/ కొల్లాపూర్ రూరల్: పునరావాస ప్రాంతంలో నివసించే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అటవీ శాఖ పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం లింగాల రేంజ్ పరిధిలోని బాచారం బీట్ పునరావాస ప్రాంతాన్ని అటవీ శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా పీసీసీఎఫ్ మాట్లాడుతూ పునరావాస ప్రాంతంలో ఇప్పటికే ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలను కూడా అందజేయడం జరిగిందన్నారు. పునరావాస ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాల డిజైన్లను, సీసీ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, ఇతర మౌళిక సదుపాయాలను మ్యాప్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బీట్ పరిధిలోని సార్లపల్లి, పులిచింతల బావి, వటువర్లపల్లి గ్రామాల ప్రజలు ఉన్నతాధికారులను కలిసి పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీపీటీ ప్రసాద్, డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర, ఎఫ్‌డీఓ చంద్రశేఖర్, ఎఫ్‌ఎస్‌పీ ఎఫ్‌డీఓ రామ్మోహన్, ఎఫ్‌ఆర్వో ఈశ్వర్, ఎఫ్‌ఎస్‌ఓ వెంకటేష్, ఎఫ్‌బీఓ ఎండీ ఖాదర్‌పాష పాల్గొన్నారు.
● కొల్లాపూర్ మండలంలోని కృష్ణానది బ్యాక్‌వాటర్ సమీపంలో అంకాలమ్మ కోట దగ్గర పాత బొల్లారంలో ఏర్పాటు చేసిన వాచ్‌టవర్‌ను పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వసతులను, అనంతరం సోమశిల సమీపంలో ఆక్రమణకు గురైన ఫారెస్టు భూమిని, ఏకో పార్క్‌ను పరిశీలించారు. అక్కడ ఉన్న వాచ్‌టవర్ నుంచి సోమశిల నది పరిసరాలు, కృష్ణా రివర్ బెల్టులో బోటులో పర్యటించారు.
23ఏసీపీటీ403 : పునరావాస ప్రాంతంలో సదుపాయాల గురించి మ్యాప్ ద్వారా వివరిస్తున్న అధికారులు


