ఆర్టీసీలో ఎన్నికల సందడి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో ఎన్నికల సందడి

Sep 26 2026 1:26 AM | Updated on Sep 26 2026 1:26 AM

జిల్లాలోని నాలుగు డిపోలో పరిధిలో నిర్వహణ

● నేడు గుర్తుల కేటాయింపు.. అక్టోబర్‌ 9న పోలింగ్‌

● జిల్లావ్యాప్తంగా

1,147 మంది కార్మికులు

కందనూలు: సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీలో గుర్తింపు పొందిన సంఘం ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల తేదీ ఖరారు కావడంతో వివిధ సంఘాలు బలాబలాలను అంచనా వేసుకుంటూ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 ఆర్టీసీ గుర్తింపు యూనియన్లు ఉండగా.. జిల్లాలో మాత్రం ప్రధాన యూనియన్ల మధ్యనే ఎక్కువ పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కార్మికులు డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయగా.. ఆర్టీసీలో యూనియన్లను నిషేధించిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కార్మికులు తమ సమస్యలు ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేక సతమతమయ్యారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతుండటంతో కార్మికులకు కొంత ఊరట కలిగిస్తుంది.

ప్రారంభమైన ప్రక్రియ..

గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడానికి ఈ నెల 21న పోటీ చేయాల్సిన కార్మిక సంఘాలు సమ్మతి పత్రాలు సమర్పించాయి. 22న డిపో మేనేజర్లు ఓటర్ల జాబితా అందజేసి.. 24న అభ్యంతరాలు స్వీకరించారు. శుక్రవారం తుది ఓటరు జాబితా ప్రకటించగా.. శనివారం పోటీ చేసే యూనియన్లకు గుర్తుల కేటాయింపు, రిటర్నింగ్‌ అధికారికి తుది ఓటరు జాబితా సమర్పిస్తారు. 29న యూనియన్లకు డమ్మీ బ్యాలెట్‌ పేపర్లను పంపిణీ చేస్తారు. అక్టోబర్‌ 9న ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. 17న ఫలితాలు వెల్లడిస్తారు.

డిపో డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్‌లు సూపర్‌

వైజర్లు

నాగర్‌కర్నూల్‌ 87 145 28 28

అచ్చంపేట 94 160 34 21

కొల్లాపూర్‌ 64 106 30 15

కల్వకుర్తి 111 176 25 23

జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో ఉద్యోగులు ఇలా..

సమస్యలు పరిష్కారమయ్యేనా..?

ఆర్టీసీలో అనేక కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో గెలుపొందిన సంఘాన్నే అధికారిక గుర్తింపు సంఘంగా పరిగణిస్తారు. రీజియన్‌ స్థాయి, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సంఘాలుంటాయి. రెండింటికి వేర్వేరు బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు నిర్వహిస్తారు. కార్మికుల వేతనాలు, డీఏలు, బోనస్‌ మొదలుకొని పలు సమస్యలపై చర్చలు జరిపే చట్టబద్ధమైన హక్కు గుర్తింపు పొందిన సంఘానికే ఉంటుంది. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, ఇతర కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి గెలుపొందిన సంఘం ముందుండి కృషి చేస్తుంది. అయితే గత పదేళ్ల నుంచి ఆర్టీసీలో యూనియన్లు లేకపోవడంతో యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. డ్యూటీ విషయంలో కార్మికులను ఇబ్బందులు పెడుతూ సెలవులు, స్పెషల్‌ ఆఫ్‌లు రద్దుచేయడం, రోజుకు 15 గంటల వరకు పనిచేయించడం, ఓటీలు ఇవ్వకపోవడంతో పదేళ్లపాటు ఆర్టీసీ కార్మికులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్మికులకు రావాల్సిన బకాయిలు సరైన సమయంలో చెల్లించకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో ఇప్పటికై నా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement