వీబీజీ రాంజీ మార్గదర్శకాలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

వీబీజీ రాంజీ మార్గదర్శకాలు పాటించాలి

Sep 26 2026 1:26 AM | Updated on Sep 26 2026 1:26 AM

నాగర్‌కర్నూల్‌/ కందనూలు: వీబీజీ రాంజీ పథకం అమలులో మార్గదర్శకాలు పాటించాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌పాటిల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్‌ సిబ్బందికి కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. వీబీజీ రాంజీ పథకం లక్ష్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రజలకు ఉపాధి కల్పించడంతోపాటు, గ్రామాల దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదపడే శాశ్వత ఆస్తులు, మౌలిక వసతుల కల్పన, నీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పనులు చేపట్టాలన్నారు. పథకం కింద చేపట్టే పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనం, నాణ్యత, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పనులు పూర్తయ్యేలా సంబంధిత అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అనంతరం వీబీజీ రాంజీ పథకంలో చేపట్టాల్సిన పనుల గుర్తింపు, ప్రాధాన్యత, అమలు విధానం, సాంకేతిక అంశాలు, పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ దేవసహాయం, డీఆర్‌ఓ పాండు, డీఆర్‌డీఓ చిన్న ఓబులేషు, డీపీఓ శ్రీరాములు, అదనపు డీఆర్‌డీఓ రాజేశ్వరి, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

● వయోవృద్ధుల సంక్షేమంపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 1 వరకు వారం రోజుల పాటు నిర్వహించే ‘ఎల్డర్‌ గైడ్‌’ వాల్‌పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంరక్షణ, భద్రత, సంక్షేమం, చట్టబద్ధమైన హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు సంబంధిత ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

● జిల్లాలో రీ సర్వే, భూభారతి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ అన్నారు. భూముల రీ సర్వే, భూ భారతి, రెవెన్యూ అంశాలపై అచ్చంపేట సబ్‌ కలెక్టర్‌ సలోని ఛాబ్రా, అదనపు కలెక్టర్‌ చెన్నయ్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో రీ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, భూ రికార్డుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే పూర్తయిన తర్వాత బౌండరీల వారీగా మ్యాపులను రూపొందించాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement