చెంచులకు మెరుగైన సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

చెంచులకు మెరుగైన సేవలు అందించాలి

Sep 27 2026 1:10 AM | Updated on Sep 27 2026 1:10 AM

మన్ననూర్‌: ఐటీడీఏ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిస్కరిస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో ఐటీడీఏకు అనుసంధానంగా ఉన్న గిరిజన అభివృద్ధి సంస్థ, విద్య, వైద్యం, ఇంజినీరింగ్‌, ఆర్డీటీ, జీసీసీ, ఐసీడీఎస్‌ తదితర అధికారులతో సమీక్షించారు. కొంతకాలంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంతోపాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెంచుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న 22 ఆరోగ్య ఉప కేంద్రాలు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో నిర్మించి ప్రారంభిస్తే చెంచులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని, ఐటీడీఏ భవనానికి మరమ్మతు చేపట్టాలని ఏఓ జాఫర్‌ హుస్సేన్‌ తెలిపారు. మన్ననూర్‌లో కొనసాగిన సీఓఈ కళాశాలను నల్లమల విద్యార్థులకు అందుబాటులో ఉండేలా తిరిగి అచ్చంపేటలో కొనసాగించాలని ఆదివాసీ ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు శ్రీనివాసులు కోరారు. అనంతరం కమిషన్‌ చైర్మన్‌ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఐటీడీఏను సందర్శించానన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని పాఠశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రహరీలు, అంగన్‌వాడీలకు పక్కా భవనాలతోపాటు కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు అందించేలా కృషిచేస్తానన్నారు. అనంతరం అంబేడ్కర్‌ కాలనీలోని పాఠశాలను సందర్శించి సమస్యల గురించి తెలుసుకున్నారు. కమిటీ సభ్యుడు వెంకటకృష్ణ, సబ్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీఓ సలోని ఛాబ్రా, డీటీడీఓ కోటాజీ, వెంకట్‌నారాయణ, డీఎండీహెచ్‌ఓ రవికుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తారాసింగ్‌, ఆర్సీఓ కల్యాణి, జీసీసీ మేనేజర్‌ చంద్రభాను, చెంచు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement