మాది నాగర్‌కర్నూల్ మండలం మంతటి గ్రామం. పదో తరగతి వరకు మా ఊరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఇంటర్ ఎంజేపీ సిద్ధిపేటలో చదివాను. ఆ తర్వాత ఏడాదిపాటు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఎంబీబీఎస్ సీటు సాధించాను. మా నాన్న మల్లయ్య డ్రైవర్, అమ్మ లలిత కూలి పనిచేస్తూ మమ్మల్ని చదివించింది. మా నాన్న 2022లో గుండె సంబంధిత వ్యాధితో మరణించినా.. అమ్మ కష్టం, ఎన్‌ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి ప్రోత్సాహంతో నేను ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. పేదలకు వైద్యం చేయడమే లక్ష్యంగా ఈ వృత్తిని ఎంచుకున్నాను.


