జయశంకర్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం | - | Sakshi
Sakshi News home page

జయశంకర్‌ ఆశయ సాధనకు కృషి చేద్దాం

Aug 7 2026 2:08 AM | Updated on Aug 7 2026 2:08 AM

నాగర్‌కర్నూల్‌: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ చెన్నయ్య అన్నారు. జయశంకర్‌ సార్‌ జయంతి సందర్భంగా గురువారం జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఐడీఓసీలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జయశంకర్‌ ఆలోచనలు, ఉద్యమ స్ఫూర్తి, అచంచల సంకల్పం కీలక పాత్ర పోషించాయని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే లక్ష్యంతో ఆయన జీవితాంతం చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. రాష్ట్రాభివృద్ధి, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు నేటికీ సమకాలీనమైనవేనని అన్నారు. యువత జయశంకర్‌ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా సేవాభావంతో ముందుకుసాగాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో పాండు, బీసీ సంక్షేమశాఖ అధికారి ఇందిర, గిరిజన సంక్షేమశాఖ అధికారి కోటయ్య, ఏవో చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement