అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Jul 6 2026 1:04 AM | Updated on Jul 6 2026 1:04 AM

తిమ్మాజిపేట/తాడూరు: సొంతిల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. తిమ్మాజిపేట మండలం మరికల్‌, తాడూరు మండలం ఎత్మతాపూర్‌లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్నివర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. పేదలకు గౌరవప్రదమైన నివాస వసతి కల్పించాలనే లక్ష్యంతో అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో అనేక కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందన్నారు. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను పండుగ వాతావరణలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లయ్యగౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంచ్రందారెడ్డి, సర్పంచులు మల్లయ్య, మాధవి, నాయకులు వెంకట్రామారెడ్డి, కొత్త శ్రీను, రవూఫ్‌, నాగసాయిలు, మాజీ సర్పంచ్‌ నర్సింహ, లింగం, ముబారక్‌ ,శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ ఎర్రయ్య, వినోద్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement