దరఖాస్తు చేసుకోండి
కందనూలు: భవన నిర్మాణ సంక్షేమ బోర్డు గుర్తింపు కార్డు కోసం జిల్లాలోని కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కార్మికశాఖ అధికారి రాజ్‌కుమార్ సోమవారం ఒక ప్రకట నలో తెలిపారు. గురింపు కార్డు పొందిన కార్మికులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని.. భవన నిర్మాణ కార్మికులందరూ తప్ప నిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నేడు జిల్లాస్థాయి
దివ్యాంగుల ఆటల పోటీలు
కందనూలు: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ విభాగంలో 10–17 ఏళ్లు, సీనియర్ విభాగంలో 18–54 ఏళ్ల వయసు కలిగిన దివ్యాంగులు తమ సదరం సర్టిఫికెట్, ఆధార్‌కార్డుతో ఉదయం 9 గంటలకు పాఠశాల మైదానానికి రావాలని ఆయన సూచించారు.
రాష్ట్ర కబడ్డీ జట్టు
కెప్టెన్‌గా నందిని
కందనూలు: అమ్రాబా ద్ మండలం పదరకు చెందిన కబడ్డీ క్రీడాకారిణి నందిని రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా ఎంపికై నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జనార్దన్‌రెడ్డి, యాదయ్యగౌడ్ తెలిపారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలోని సోనీపాట్‌లో జరిగే 35వ జాతీయస్థాయి జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో నందిని తెలంగాణ తరఫున పాల్గొంటుందని పేర్కొన్నారు. గత సెప్టెంబర్‌లో నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎంపికై న నందినికి డీవైఎస్‌ఓ సీతారాం నాయక్ అభినందనలు తెలిపారు.
‘కురుమూర్తి’ హుండీ ఆదాయం రూ.84 లక్షలు
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతరను పురస్కరించుకొని హుండీల ద్వారా మొత్తం రూ.84,12,564 ఆదాయం సమకూరింది. ఈ సంవత్సరం నెలరోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగిన ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలతోపాటు ఇతర దేశాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు వివిధ రకాల కానుకలు స్వామివారికి సమర్పించుకున్నారు. ఈ కానుకల హుండీని ఆలయ అధికారులు నెలరోజుల వ్యవధిలో మూడుసార్లు లెక్కించారు. మొదటిసారి హుండీ ద్వారా రూ.28,70,536, రెండోసారి రూ.24,83,628 రాగా.. తాజాగా సోమవారం మూడోసారి లెక్కింగా రూ.30,58,400 వచ్చింది. దీంతో ఈ సంవత్సరం జాతర హుండీ ఆదాయం మూడు దఫాలు కలుపుకొని మొత్తం రూ.84,12,564 సమకూరినట్లు ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మదనేశ్వరెడ్డి తెలిపారు. గతేడాది జాతర ద్వారా హుండీ ఆదాయం రూ.79,68,810 రాగా.. ఈసారి రూ.4,43,754 అదనంగా వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇతర దేశాల నుంచి భక్తులు రావడంతో యూఎస్‌ఏ వన్ డాలర్లు 3, 5 డాలర్ 1, టెన్ డాలర్ 2 వచ్చాయి. అలాగే సింగపూర్ టెన్ డాలర్ 1, బ్యాంకాక్ వంద యూరోస్ 1, మలేషియా టెన్ యూరోస్ 1 వచ్చాయి.
ఉత్సాహంగా బాస్కెట్‌బాల్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సోమవారం ఉమ్మడి జిల్లా సీనియర్ పురుష, మహిళా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎంపికై న జట్లు సంగారెడ్డిలో ఈ నెల 28 నుంచి 30 వరకు జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్‌బిన్ అహ్మద్ జాకీర్ అడ్వకేట్, నసరుల్లా హైదర్‌తోపాటు మీర్ అర్షద్‌అలీ, సయ్యద్ షరీఫ్‌అలీ, సుభాన్‌జీ, ఎండీ ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తు చేసుకోండి
దరఖాస్తు చేసుకోండి


