రుణపడి ఉంటాం..
గద్వాల మండలంలోని కొత్తపల్లి గ్రామం మీదుగా కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని మా చిన్నప్పటి నుంచి వింటున్నాం. కొంతమంది కుట్రల కారణంగా వంతెన విషయం మరుగున పడింది. ఎన్నో ఏళ్ల కలను ఇప్పుడు సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మా ప్రాంత ప్రజలు రుణపడి ఉంటాం.
– అశోక్‌రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి గ్రామం, గద్వాల జిల్లా
పూర్వవైభవం తీసుకువస్తా..
ఇచ్చిన మాట ప్రకారం జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం భూమి పూజకు డిసెంబర్ 1న సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారు. ఒకప్పుడు సంస్థానంగా, తాలుకా కేంద్రంగా అన్ని రకాల కార్యాలయాలతో ఆత్మకూర్ వెలుగొందింది. ఆత్మకూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో సహా రెవెన్యూ మంత్రి, కలెక్టర్‌కు విన్నవించగా.. సానుకూలంగాస్పందించారు. ఆత్మకూర్‌కు పూర్వవైభవం తీసుకువస్తా. – వాకిటి శ్రీహరి,
రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి
●


