
అంతా.. అప్రమత్తం
ఆగని అవినీతి..
నాగర్‌కర్నూల్
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారుల హై అలర్ట్
I
‘స్వతంత్ర భారతదేశంలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. దాదాపు అన్ని రంగాల్లోనూ అవే రాజ్యమేలుతున్నాయి. స్వేచ్ఛ.. సమానత్వం అనేవి మాటలకే పరిమితమయ్యాయి. విద్య, వైద్యం అంటే కాసులు కుమ్మరించాల్సిందే.. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆయా విభాగాల్లో మెరుగైన ఫలితాల సాధనకు ప్రజాప్రతినిధులు మరింత కృషిచేయాలి.. ఈ మేరకు చట్టసభలతో పాటు అధికార యంత్రాంగంలో మార్పు రావాలి. మరింత నీతి, నిజాయితీగా పనిచేస్తూ స్వాతంత్య్ర ఫలాలను ప్రతిఒక్కరికీ అందించాలి..’
అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో 78 ఏళ్లు పూర్తి చేసుకుని శుక్రవారం 79వ వసంతంలోకి అడుగిడుతున్న స్వతంత్ర భారతావనిలో స్వాతంత్య్ర ఫలాలు అందుతున్నాయా? వంటి పలు అంశాలపై ‘సాక్షి’ గురువారం సర్వే చేపట్టింది. పలు వర్గాల ప్రజలు ఉత్సాహంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సర్వే సాగిందిలా..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో మొత్తం 150 మంది నుంచి ‘సాక్షి’ బృందం శాంపిళ్లు సేకరించింది. ఒక్కో జిల్లా నుంచి 30 మంది (పురుషులు 15, మహిళలు 15) చొప్పున అభిప్రాయాలు తీసుకుంది. ఎంచుకున్న మూడు ప్రశ్నలకు ఒక్కొక్కరి నుంచి సమాధానాలను రాబట్టింది. ఈ సందర్భంగా పలువురు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వ్యవస్థలోని కాలానుగుణ మార్పులు, లోపాలతో పాటు ఇంకా మెరుగు కావాల్సిన అంశాలను ప్రస్తావించారు.
సాక్షి, నాగర్‌కర్నూల్: భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నిరాటంకంగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని దాదాపుగా చెరువులన్నీ ఉప్పొంగి మత్తడి దూకుతున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల లోలెవల్ వంతెల వద్ద వరద పోటెత్తుతోంది. వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం కలగకుండా ఉండేందుకు కలెక్టర్ సంతోష్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అత్యవసర సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
కల్వకుర్తిలో 147.6 మి.మీ. వర్షం
జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కల్వకుర్తి మండలంలో 147.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. తిమ్మాజిపేట మండలంలో 105.5 మి.మీ. వర్షం కురిసింది. పెద్దకొత్తపల్లి, వెల్దండ, ఉప్పునుంతల, ఊర్కొండ, వంగూరు, బిజినేపల్లి, కోడేరు, చారకొండ, నాగర్‌కర్నూల్, తాడూరు మండలాల్లో 60 మి.మీ. మించి వర్షపాతం నమోదైంది. జిల్లాలో దుందుభీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద దుందుభీ ప్రవాహాన్ని అధికారులు పర్యవేక్షించారు. అచ్చంపేట మండలం మన్నెవారిపల్లె వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పునుంతల మండలంలో దుందుభీ వాగుతో పాటు చిలకల వాగు ప్రవాహం అధికం కావడంతో స్థానిక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లాకేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాంనగర్ కాలనీలో ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. కల్వకుర్తి విద్యానగర్ కాలనీలో జలమయంగా మారింది.
కేఎల్‌ఐ కాల్వకు పలుచోట్ల గండ్లు పడటంతో సమీపంలోని పంటపొలాలు జలమయం అయ్యా యి. చారకొండ మండలం జూపల్లిలో కేఎల్‌ఐ కాల్వ తెగిన ప్రాంతాన్ని కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. వెల్దండ సమీపంలో ని కేఎల్‌ఐ డీ–82 కెనాల్‌కు గండిపడింది. కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో తెగిన కేఎల్‌ఐ కాల్వను అధికారులు పరిశీలించారు. జిల్లాకేంద్రంలోని కేసరి సముద్రం చెరువు వాగుతో పాటు తూడుకుర్తి సమీపంలో ప్రమాదకరంగా పారుతున్న వాగును బైక్‌లపై దాటుతూ కిందపడిన వ్యక్తులను స్థానికులు రక్షించారు.
78 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏమిటి?
అవినీతి పేదరికం
అందని నాణ్యమైన విద్య
అందని మెరుగైన వైద్యం
కుల వివక్ష
స్వేచ్ఛ– సమానత్వం నిజంగానే అందరికీ చేరుతోందా?
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగాలు ఏవి ?
చట్ట సభలు
న్యాయ స్థానాలు
అధికార యంత్రాంగం
మీడియా
కొద్దిగా..
లేదు
అవును
నష్టనివారణకుకంట్రోల్ రూం..
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం నివారణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వరద ప్రభవిత, ముంపు ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్‌రూం ఏర్పాటుచేశారు. జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే 08540– 230201, 08540– 230203 నంబర్లకు సమాచారం అందించాలని కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంతెనలను ఎట్టి పరిస్థితుల్లో దాటేందుకు ప్రయత్నించవద్దని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని అధికారులు చెబుతున్నారు.
అంతరాలు తొలగించాలి..
సుపరిపాలన అందించే దిశగా ప్రధానంగా చట్టసభలు, అధికార యంత్రాంగంలో మార్పు రావాలనే ఆకాంక్ష ప్రజల్లో వ్యక్తమవుతోంది. పేదలు, సంపన్నుల మధ్య అంతరాలు తొలగేలా ప్రభుత్వాలు స్పష్టమైన వైఖరితో ముందుకుసాగాలని.. వ్యవస్థలను నిర్వీర్యం చేసే శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. రాజకీయ నేతల ప్రమేయం గానీ, వారి ప్రభావం గానీ లేకుంటే అధికార యంత్రాంగం బాగానే పనిచేస్తుందని.. అప్పుడు న్యాయస్థానాలు, మీడియా అవసరం ఉండదని పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
అందని ద్రాక్షగానే స్వేచ్ఛ.. సమానత్వం చట్టసభలు, అధికారుల్లో మార్పు రావాలి
మరింత నీతి, నిజాయితీగా పనిచేయాలి ‘సాక్షి’ సర్వేలో ప్రజల అభిమతం
మూడు చోట్ల తెగిన కేఎల్‌ఐ కాల్వ..
ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా అధికారుల పటిష్ట చర్యలు
జిల్లావ్యాప్తంగా
మత్తడి దూకుతున్న చెరువులు
ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు
పలుచోట్ల కేఎల్‌ఐ కాల్వకు గండి

అంతా.. అప్రమత్తం

అంతా.. అప్రమత్తం

అంతా.. అప్రమత్తం

అంతా.. అప్రమత్తం

అంతా.. అప్రమత్తం

అంతా.. అప్రమత్తం

అంతా.. అప్రమత్తం

అంతా.. అప్రమత్తం

అంతా.. అప్రమత్తం

అంతా.. అప్రమత్తం

అంతా.. అప్రమత్తం

అంతా.. అప్రమత్తం