
సరిపోవడం లేదు..
నేను ఈసారి 4 ఎకరాల్లో వరితో పాటు 16 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగుచేశాను. పంటలకు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి వచ్చాను. ఇక్కడ ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. ఈ బస్తాలు ఏమాత్రం సరిపోవడం లేదు. పంటలకు సరిపడా యూరియా పంపిణీ చేయాలి.
– కృష్ణయ్య, రైతు, రాచూరు, వెల్దండ మండలం
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు..
జిల్లాలోని ఎరువుల దుకాణాలు, స్టాక్ పాయింట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంది. డీలర్లు ఎరువులను ఎమ్మార్పీ ధరలకు మించి విక్రయించినా, కృత్రిమంగా కొరత సృష్టించేందుకు ప్రయత్నించినా చర్యలు తీసుకుంటాం. డీలర్ల లైసెన్స్‌లను రద్దుచేస్తాం.
– యశ్వంత్‌రావు,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
●