పంద్రాగస్టు వేడుకలకు ప్లానింగ్‌ బోర్డు వైస్‌చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టు వేడుకలకు ప్లానింగ్‌ బోర్డు వైస్‌చైర్మన్‌

Aug 14 2025 7:08 AM | Updated on Aug 14 2025 7:11 AM

నాగర్‌కర్నూల్‌ క్రైం: జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్‌ మైదానంలో శుక్రవారం నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జీఓ జారీ చేశారు. స్వాతంత్య్ర వేడుకల్లో చిన్నారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. జిల్లా ప్రగతిని వివరించనున్నారు.

మాదకద్రవ్యాలకు

దూరంగా ఉండాలి

కందనూలు: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని.. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకుసాగాలని సూచించారు. డ్రగ్స్‌ విక్రయించినా, కొనుగోలు చేసిన వారిపై టోల్‌ఫ్రీ నంబర్‌ 14446కు సమాచారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ మదన్మోహన్‌, అధ్యాపకులు అంజయ్య, ఉమాదేవి, కోదండరాములు, డీహెచ్‌ఈడబ్ల్యూ కోఆర్డినేటర్‌ శ్వేత, జెండర్‌ స్పెషలిస్ట్‌ సునీత పాల్గొన్నారు.

అన్నవరానికి ప్రత్యేక బస్సు

కందనూలు: నాగర్‌కర్నూల్‌ డిపో నుంచి అన్నవరం క్షేత్రానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్‌ యాదయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19న రాత్రి 8గంటలకు జిల్లా కేంద్రం నుంచి బస్సు బయలుదేరి.. 20న అన్నవరం చేరుకుంటుందని పేర్కొన్నారు. అక్కడ సత్యనారాయణస్వామి వ్రతం అనంతరం పిఠాపురం, ద్రాక్షారామం దర్శనాలు చేసుకొని ద్వారకా తిరుమలలో రాత్రి బస ఉంటుందన్నారు. 21న విజయవాడ, మంగళగిరిలో దర్శనాలు చేసు కొని జిల్లాకేంద్రానికి చేరుకుంటుందని డీఎం తెలిపారు. ఈ యాత్రకు బస్సు చార్జీ రూ. 2,800 నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

కృత్రిమ మేధపైఉపాధ్యాయులకు శిక్షణ

కందనూలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం కృత్రిమ మేధ (ఏఐ)పై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి కాంప్లెక్స్‌ నుంచి గణిత ఉపాధ్యాయులు ఇద్దరు చొప్పున 114 మందికి పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ ఉపకరణాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఇన్‌చార్జి ఏఎంఓ కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఉపాధ్యాయులు డిజిటల్‌ బోధనపై నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ భాస్కర్‌రెడ్డి, రిసోర్స్‌పర్సన్లు లక్ష్మీనరసింహారావు, ఆంజనేయులు, దీప, విజయలక్ష్మి, కరుణాకర్‌ పాల్గొన్నారు.

విద్యా ప్రమాణాలపెంపునకు కృషి చేయాలి

తిమ్మాజిపేట: తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సమర్థవంతమైన బోధనా పద్ధతులు అవలంబించి విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని డీఈఓ రమేశ్‌కుమార్‌ సూచించారు. బుధవారం తిమ్మాజిపేట కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, ప్రాథమిక పాఠశాలల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక విద్య దశలోనే బలమైన బోధన జరిగితే విద్యార్థులు ఉన్నతస్థాయిలో అద్భుత విజయాలు సాధిస్తారన్నారు. తరగతుల వారీగా విద్యార్థుల ఆసక్తులను గుర్తించి ప్రతిభకు తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఉపాధ్యాయులు ఉత్సాహాన్నీ పెంచే బోధనశైలి అవలంబించాలన్నారు. అదే విధంగా విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని సూచించారు. కాగా, కేజీబీవీలో మధ్యాహ్న భోజనాన్ని డీఈఓ పరిశీలించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అంతకుముందు మరికల్‌ పాఠశాలను డీఈఓ పరిశీలించారు.

పంద్రాగస్టు వేడుకలకు ప్లానింగ్‌ బోర్డు వైస్‌చైర్మన్‌ 
1
1/2

పంద్రాగస్టు వేడుకలకు ప్లానింగ్‌ బోర్డు వైస్‌చైర్మన్‌

పంద్రాగస్టు వేడుకలకు ప్లానింగ్‌ బోర్డు వైస్‌చైర్మన్‌ 
2
2/2

పంద్రాగస్టు వేడుకలకు ప్లానింగ్‌ బోర్డు వైస్‌చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement