Sakshi News home page

రెండోసారి పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి పదవి

Published Wed, Dec 6 2023 1:00 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎలాంటి రాజకీయ వారసత్వం లేదు.. సామాన్య కుటుంబంలో జని్మంచిన వ్యక్తి. సడలని పట్టుదల, అకుంఠిత దీక్షతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన  ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఉమ్మడి పాలమూరు కీర్తిపతాకాన్ని మరోమారు రెపరెపలాడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రాభవాన్ని కోల్పోయి అచేతన స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు అలుపెరగని పోరాటంతో ఊపిరిలూదిన ఎనుముల రేవంత్‌రెడ్డి. రాష్ట్రంతోపాటు కేంద్రంలోని అధికార పారీ్టలపై పదునైన విమర్శలు, ఉద్వేగపూరిత ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

హస్తం గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలో మార్పు రావాలి అనే నినాదంతో ప్రజల మనసులను గెలుచుకున్నారు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) చీఫ్‌గా బాధ్యతలు  స్వీకరించిన అనతికాలంలోనే పార్టీని అధికార బాట పట్టించారు. నల్లమల అటవీ పరిధిలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో జని్మంచిన ఆయనను సీఎంగా ఖరారు చేస్తూ కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  

బూర్గుల తర్వాత మళ్లీ.. 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన బూర్గుల రామకృష్ణారెడ్డి 1952లో  షాద్‌నగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైహైదరాబాద్‌ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. సుమారు 71 ఏళ్ల తర్వాత  ఇప్పుడు ఇదే జిల్లాకు చెందిన కొడంగల్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో సీఎం మనోడే అంటూ ఆయన పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లి , ప్రాతినిధ్యం
వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.  

రైతు కుటుంబం నుంచి.. 
వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులది సాధారణ రైతు కుటుంబం. వీరికి ఏడుగురు మగ, ఒక ఆడ సంతానం. 1967 నవంబర్‌ 8న రేవంత్‌రెడ్డి జన్మించారు. రేవంత్‌రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం ఐదో తరగతి వరకు కొండారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో కొనసాగింది. ఆరో తరగతి కల్వకుర్తి మండలం (అప్పుడు వెల్దండ) తాండ్రలోని ఉన్నత పాఠశాలలో చదివారు. ఏడు నుంచి పదో తరగతి వరకు వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇంటరీ్మడియట్‌ వనపర్తిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల.. డిగ్రీ (బీఏ ఆర్ట్స్‌) హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలో చదివారు. జేఎన్‌టీయూలో ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సు పూర్తి చేశారు. రేవంత్‌రెడ్డికి భార్య గీతారెడ్డి, కూతురు నైమిషారెడ్డి ఉన్నారు. 

ఈ అవకాశం మళ్లీ రాదంటూ.. 
రాష్ట్రంలోని 119 మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఎంతోమంది పెద్దవాళ్లు, ఉద్దండులు ఉన్నా పాలమూరు బిడ్డ సంతకంతోనే పోటీలో నిలుస్తున్నారు. ఇది పాలమూరు గడ్డ గొప్పతనం. హైదరాబాద్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తర్వాత 70 ఏళ్లకు మళ్లీ మనకు అవకాశం వచ్చింది. ఇప్పుడు చేజారితే ఈ అవకాశం రాదు. పాలమూరు బిడ్డలు నాటిన మొక్కను నరికేందుకు ఢిల్లీ నుంచి కొందరు, గల్లీ నుంచి మరికొందరు గొడ్డళ్లు పట్టుకుని వస్తున్నారు. పాలమూరు బిడ్డలు చైతన్యంతో ఎదురుతిరగాలి.   – రేవంత్‌రెడ్డి        

టీపీసీసీ చీఫ్‌ తర్వాత అనతికాలంలోనే.. 
2021లో టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సుమారు రెండేళ్లుగా పక్కా ప్రణాళికతో కాంగ్రెస్‌ అగ్రనేతల సహకారంతో, ఐకమత్యంతో పార్టీని ముందుకు నడిపిస్తూ.. నిరి్వరామంగా ప్రజల్లో ఉంటూ పార్టీని విజయతీరాలకు చేర్చారు. అనతి కాలంలోనే తన సవాల్‌ను నెగ్గించుకోవడమే కాకుండా.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు రెడీ అవుతున్నారు. 

జెడ్పీటీసీ టు ముఖ్యమంత్రి.. 
రేవంత్‌కు చిన్ననాటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలో 2004లో బీఆర్‌ఎస్‌ అప్పటి టీఆర్‌ఎస్‌లో చేరి కొంతకాలం పనిచేశారు. 2006లో మిడ్జిల్‌ మండలం నుంచి జెడ్పీటీసీ అభ్యరి్థగా స్వతంత్రంగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత స్థానిక సంస్థల కోటాలో మహబూబ్‌నగర్‌ శాసనమండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థగా గెలిచారు. ఆ తర్వాత  టీడీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి 2009, 2014లో కొడంగల్‌ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  

‘ఓటుకు నోటు’తో మలుపు.. తొలి నుంచీ దూకుడే.. 
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగా.. 2015 మే 15న రేవంత్‌రెడ్డిని ఓటుకు నోటు కేసులో పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఆ సమయంలో కేసీఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యమని ప్రకటించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2017లో టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతూ 2018 ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 2021 జూలై 7న టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది తనతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అఖండ మెజార్టీ వచ్చేలా చేసి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా రేవంత్‌ తొలి నుంచీ దూకుడుగానే ముందుకు సాగారు.    

పదునైన విమర్శలు..ఉద్వేగపూరిత ప్రసంగాలు 
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పదునైన విమర్శలు, ఉద్వేగపూరిత ప్రసంగాలే కాదు.. దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం, వెంటనే అమలు చేయడం ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రత్యేకత. చిన్న నాటి నుంచి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన 2006లో మిడ్జిల్‌ జెడ్పీటీసీ సభ్యుడిగా బరిలో నిలిచి గెలిచిన తీరు ఇప్పటికీ చర్చనీయాంశమే. ఒక సారి ఎమ్మెల్సీ, ఒక దఫా ఎంపీ, ఇప్పటితో కలిపి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్‌ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు. అయినా పట్టుదలతో టీపీసీసీ చీఫ్‌గా అనతికాలంలోనే కాంగ్రెస్‌లో జవసత్వాలు నింపి.. పార్టీని ముందుండి నడిపించారు. తాను బరిలో నిలిచిన కొడంగల్‌లో నామినేషన్‌కు ఒక రోజు, రోడ్‌షోకు మరో రోజు, కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ సభకు ఇంకో రోజు.. ఇలా కేవలం మూడు సార్లు మాత్రమే ప్రచారానికి వచ్చిన రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల్లో 83 ప్రచార సభల్లో పాల్గొన్నారు. అధికార బీఆర్‌ఎస్, బీజేపీలపై తూటాల్లాంటి మాటలు, విమర్శలతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపడమే కాకుండా.. ఉద్వేగ ప్రసంగాలతో ప్రజల మనసు దోచుకుని కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి రేపు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న నేపథ్యంలో ఆయన రాజకీయ జీవితంలో చోటుచేసుకున్న తీపిగుర్తులు, ప్రసంగాల తీరును ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.  

ఎస్‌.. ఢీ అంటే ఢీ.. 
నల్లగొండలో నిర్వహించిన సభలో ఆ జిల్లాకు చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మేము మా జిల్లాలో 12కు 12 సీట్లు గెలుస్తాం.. రేవంత్‌రెడ్డి పాలమూరులో 14కు 14 సీట్లు గెలిపిస్తారా అని సవాల్‌ విసిరారు. అక్కడే ఉన్న రేవంత్‌రెడ్డి సైతం యస్‌.. గెలిచి తీరుతాం అన్నారు. వారు అన్నట్లే నల్లగొండ జిల్లాలో 11 సీట్లు కాంగ్రెస్‌కు రాగా.. మహబూబ్‌నగర్‌లో 12 కైవసం చేసుకున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement