పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చాలి | - | Sakshi
Sakshi News home page

పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చాలి

Nov 12 2026 1:31 AM | Updated on Nov 12 2026 1:31 AM

● డిప్యూటీ డైరెక్టర్‌ జనార్దన్‌

ఏటూరునాగారం: విద్యార్థులు పోటీపరీక్షల్లో ప్రతిభ కనబర్చాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ దబ్బగట్ల జనార్దన్‌ సూచించారు. ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఐదు క్లబ్‌ల్లో విజేతులుగా నిలిచిన విద్యార్థులకు బుధవారం ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జనార్దన్‌ మాట్లాడుతూ సైన్స్‌ టెక్నాలజీలో జస్విక, ఎకో క్లబ్‌లో రిషిత, స్పోర్ట్స్‌, ఫిట్‌నెస్‌లో అక్షయ, ఆర్ట్స్‌, కల్చరర్‌లో అంకిత, లెటర్చెరీలో ప్రియాంక ఉమ్మడి జిల్లా క్లబ్‌ పోటీలకు ఎంపికై నట్లు ఆయన వివరించారు. ఈనెల 13న ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఓ అజయ్‌కుమార్‌, ఏసీఎంఓ కోడి రవీందర్‌, స్పోర్ట్స్‌ ఆఫీసర్లు ఆదినారాయణ, శ్యామలత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement