విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలి

Nov 12 2026 1:31 AM | Updated on Nov 12 2026 1:31 AM

ములుగు: స్వాతంత్య్ర సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు సూచించారు. భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ములుగు సమీకృత జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) సీహెచ్‌ మహేందర్‌ జీతో కలిసి కలెక్టర్‌ సహదేవరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ దేశంలో విద్యావ్యవస్థ బలోపేతానికి, విద్యావకాశాల విస్తరణకు ఆజాద్‌ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రామ్మోహన్‌, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, పరిపాలన అధికారి రాజ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఈవీఎంల గోదాం తనిఖీ

ములుగు ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని ఈవీఎంల గోదాంను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్‌ సహదేవరావు బుధవారం నెలవారీ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాం సీల్‌ను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్నిప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన భద్రతా పరికరాలను తనిఖీ చేశారు. గోదాం వద్ద పోలీసు బందోబస్తు, భద్రతా రిజిస్టర్లు, సందర్శకుల నమోదు పుస్తకాలను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన భద్రతా చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ విజయభాస్కర్‌, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్‌ నితీష్‌ కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

ఘనంగా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement