మిర్చి నారుకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

మిర్చి నారుకు డిమాండ్‌

Nov 12 2026 1:31 AM | Updated on Nov 12 2026 1:31 AM

ఏటూరునాగారం: ఎండవేడి, మల్చింగ్‌ పద్ధతిలో మొక్క నాటిన ప్రదేశంలో నీరు నిల్వ ఉండడంతో మిర్చి మొక్కలు మాడిపోతున్నాయి. ఈ క్రమంలో అలాంటి మొక్కలను తొలగించి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటడంతో మిర్చి నారుకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ క్రమంలో ఒక్కో మొక్కకు ఒక్కో ధర ఉంది. దొడ్డు రకం మొక్కకు రూ.1.50, సన్నరకానికి రూ.1 ధర పలుకుతోంది. రైతుల అవసరాలను అవకాశంగా మలుచుకొని మిర్చి మొక్కలను వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పంటలో అధికంగా కలుపు (గడ్డి) వస్తోందని మల్చింగ్‌ పద్ధతిలో సాగు చేసిన రైతులకు కొత్తరకం ఇక్కట్లు వచ్చిపడుతున్నాయి. కలుపు తీసే కష్టం తగ్గుతుందని మల్చింగ్‌ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఉష్ణోగ్రతకు మొక్కల వేర్లు కుళ్లిపోయి పాడైపోతున్నాయి. వాటి స్థానంలో మళ్లీ మొక్కలు నాటాల్సిన పరిస్థితి బాధిత రైతులకు ఏర్పడింది. ఎలాగైనా పంటను దక్కించుకోవాలన్న ఆశతో మళ్లీ మొక్కలను కొనుగోలు చేస్తూ అదనపు భారాన్ని మోస్తున్నారు.

గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధిక సాగు

జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో అత్యధికంగా మిర్చి పంటను రైతులు సాగు చేస్తున్నారు. దిగుబడి ఎక్కువగా రావాలని, పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవడానికి నూతన పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో కలుపు నివారణకు మల్చింగ్‌ పద్ధతిని అవలంబిస్తున్నారు. దీంతో ఎండ వేడికి పేపర్‌ మరింత వేడెక్కి వేర్లు కుళ్లిపోయి మొక్కలు వాడిపోతున్నాయి. అనివార్య పరిస్థితుల్లో మాడిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ కొత్త మొక్కలను రైతులు నాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని గమనించిన కొంతమంది వ్యాపారులు మిర్చి నారును ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో రైతుకు ఒక్కో ధరతో నారును విక్రయిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రూ.1, రూ.1.50, రూ.2లకు కొనుగోలు చేయాల్సి వస్తోందని బాధిత రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా పది మండలాల్లో 15,605 మంది రైతులు సుమారు 24,727.09 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా మిర్చి సాగు వివరాలు

ఎండలకు, నీటి నిల్వతో మాడిపోతున్న మొక్కలు

మొక్కకు రూ.1 – రూ.2 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్న బాధిత రైతులు

మల్చింగ్‌ పద్ధతిలో సాగు చేసిన వారిపై

అదనపు భారం

మండలం రైతులు ఎకరాలు

ఏటూరునాగారం 1,709 2345.62

గోవిందరావుపేట 10 14.04

కన్నాయిగూడెం 3,428 5674.33

మంగపేట 1,292 2723.53

తాడ్వాయి 33 46.36

వెంకటాపురం(కె) 2,211 3559.41

వాజేడు 5,762 8957.13

మల్లంపల్లి 238 243.43

ములుగు 215 268.02

వెంకటాపురం(ఎం) 707 895.22

15,605 24,727.09

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement