ఏటూరునాగారం: ఏటూరునాగారంలో కోర్టు ఏర్పాటు చేసుకోవడం తమ హక్కు అని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, సర్పంచ్ కాకులమర్రి శ్రీలత అన్నారు. మండల కేంద్రంలోని సాయిబాబా ఫంక్షన్‌హాల్‌లో బుధవారం జరిగిన అఖిలపక్షం రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న కేసుల ఆధారంగా ఇక్కడికి కోర్టు వచ్చే అవకాశం ఉందని, ఈ క్రమంలో అన్నివర్గాల ప్రజలు ముందుకొచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 500 కేసులు ఉంటేనే ఆ ప్రాంతానికి కోర్టు వచ్చే అర్హత ఉంటుందని, తమ ప్రాంతాలో 1,380 కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతంలో కోర్టు ఏర్పడితే ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం(కె), వాజేడు, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లోని అన్ని వర్గాల ప్రజలు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తాలూకా కోర్టు సాధన సమితి అధ్యక్షుడు ఆదినారాయణ, ఉపాధ్యక్షుడు కర్నె ప్రణయ్‌ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సున్నం రమేష్, కోశాధికారి నాగలత, జాయింట్ సెక్రటరీ పూర్ణచందర్ రావు, మహిళా ప్రతినిధి శాంతకుమారి, ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు, గొప్ప వీరయ్య, అలువాల శ్రీనివాస్, పొదెం కృష్ణప్రసాద్, మైపతి అరుణ్, నల్లబోయిన కోటయ్య, పెండ్యాల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఆరు మండలాల్లో 1,380 కేసులు
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, సర్పంచ్ శ్రీలత


