న్యూస్‌రీల్
సాక్షి ప్రతినిధి, వరంగల్:
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సర్వీస్ రికార్డులను కాగితపు ఫైళ్లకే పరిమితం చేయకుండా డిజిటల్ సర్వీస్ రిజిస్టర్ (డీఎస్‌ఆర్)గా మార్చి, సర్వీస్‌కు సంబంధించిన వివిధ అంశాలను ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించేందుకు ఈహెచ్‌ఆర్‌ఎంఎస్ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.
ఉద్యోగి సర్వీస్ మొత్తం ఒకే చోట..
ఇప్పటివరకు ఉద్యోగుల సర్వీస్ రికార్డులు ప్రధానంగా భౌతిక రూపంలో ఉండడంతో సర్వీస్ వ్యవహారాల పరిష్కారంలో జాప్యం, వివరాల ధ్రువీకరణలో ఇబ్బందులు, పెండింగ్ ఫైళ్లపై కేంద్రీకృత పర్యవేక్షణ లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్‌ఎంఐ ఎస్)లో ఈ హెచ్‌ఆర్‌ఎంఎస్‌ను ప్రత్యేక మాడ్యూల్‌గా తీసుకొచ్చింది. కాగా, ఉద్యోగి సర్వీస్‌కు సంబంధించిన సెలవులు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, బదిలీలు, ఏసీఆర్/ ఏపేఏఆర్, స్థిరాస్తుల వివరాలు, విజిలెన్స్ అంశాలు, పదవీ విరమణ కేసులు తదితర వివరాలను దశలవారీగా ఈ హెచ్‌ఆర్‌ఎంఎస్‌లో నిర్వహించనున్నారు.
పర్యవేక్షించే నోడల్ అధికారులు..
ఉమ్మడి వరంగల్‌లో ఆరుగురికి నోడల్ బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ ఎ.శ్రీనివాస్‌కుమార్ (డీడీ), వరంగల్‌కు జె.విజయసారథి (ఏడీ), జనగామ ఎండీ అన్వర్ హుస్సేన్ (ఏటీఓ), జయశంకర్ భూపాలపల్లి సయ్యద్ ఖలీద్ హుస్సేన్‌ను నియమించారు. మహబూబాబాద్‌కు ఎండీ షరీఫ్బాబా, ములుగుకు సయ్యద్ ఖలీద్ (ఏటీఓ)ను నియమించారు. ఈ అధికారులు ఆయా జిల్లాల్లో డీడీఓలు, ఇతర అధికారులకు ఈహెచ్‌ఆర్‌ఎంఎస్ అమలులో సహకరించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఐఎఫ్ ఎంఐఎస్ హెల్ప్‌లైన్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం కల్పించారు.
హేమాచలక్షేత్రంలో భక్తజనం
దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు
మంగపేట: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో ఆదివారం భక్తులకు దర్శనమిచ్చింది. సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల్లో భాగంగా పూజారులు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు. దుర్గాదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఉత్సవ కమిటీ, దాతల ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు.
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం భక్తజనంతో ఆదివారం కిటకిట లాడింది. వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. స్వయంభు స్వామి వారిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూలు, పండ్లు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్న భక్తులు మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ పూజారులు గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు.
బతుకమ్మ విగ్రహం ఆవిష్కరణ
ములుగు రూరల్: మండల పరిధిలోని పత్తిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆవిష్కరించారు. ఈ మేరకు ఆదివారం పత్తిపల్లి సర్పంచ్ దారవత్ సరిత–సారయ్యల ఆధ్వర్యంలో విగ్రహాలను ఏర్పాటు చేయగా ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కుమార్‌గౌడ్, రాజేందర్, భిక్షపతి, రవి, శ్యాం తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో ఈహెచ్‌ఆర్‌ఎంఎస్ అమలు
ఉద్యోగుల సెలవులు, ఇంక్రిమెంట్లు,
పదోన్నతులు, బదిలీలన్నీ ఆన్‌లైన్‌లోనే
పెండింగ్ ఫైళ్లపై ఉన్నతాధికారుల నిఘా..
డిజిటల్ సర్వీస్ రిజిస్టర్‌తో పారదర్శకత


