రొయ్యూర్‌ జీపీలో.. రూ. 24 లక్షలు మాయం? | - | Sakshi
Sakshi News home page

రొయ్యూర్‌ జీపీలో.. రూ. 24 లక్షలు మాయం?

Sep 30 2026 1:22 AM | Updated on Sep 30 2026 1:22 AM

విచారణకు సిద్ధం..

ఏటూరునాగారం: మండల పరిధిలోని రొయ్యూర్‌ గ్రామ పంచాయతీకి చెందిన రూ. 24 లక్షల నిధులు ఆధారాలు లేకుండా డ్రా చేసి దిగమింగారని, లెక్కలు అడిగితే చూపడం లేదని వార్డు సభ్యులు కొయ్యల కృష్ణమూర్తి, సొదారి సరస్వతి, దుర్గం స్వప్న ఆరోపించారు. ఈ విషయంపై ఇటీవల వార్డు సభ్యులు కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావుకు రొయ్యూర్‌ సర్పంచ్‌ కావిరి అర్జున్‌, పంచాయతీ కార్యదర్శి ఈరుపై ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు మంగళవారం ఏటూరునాగారం ఎంపీఓ షాజహాన్‌ విచారణ అధికారిగా వెళ్లి జీపీలో విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, అక్కడకు చేరుకుని సర్పంచ్‌, కార్యదర్శులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తే వారితోనే మీరు సమావేశం నిర్వహించడం ఏంటని, బహిరంగంగా విచారణ చేయాలని ఎంపీఓను డిమాండ్‌ చేశారు. దీంతో ఆయ న గ్రామస్తులు, వార్డు సభ్యులను జీపీలోకి అనుమతించి విచారణ చేపట్టారు. అయితే గ్రామ పంచాయతీకి చెందిన బ్యాంక్‌ చెక్‌బుక్‌, ఖాతాబుక్‌, గ్రామ పంచాయతీ రికార్డు అప్‌డేట్‌ చేయడానికి ఒక రోజు సమయం కావాలని సర్పంచ్‌ అర్జున్‌, కార్యదర్శి ఈరు కోరినట్లు ఎంపీఓ ప్రజలకు వివరించారు. ఈ మేరకు రికార్డులు చూపించడానికి ఒక రోజు సమయం అడిగారని, సమయం ఇచ్చి వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకుంటే ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని ఎంపీఓ ప్రజలకు వివరించి వెనుదిరిగారు. ఈ విషయంలో ఎంపీఓ, కార్యదర్శి, సర్పంచ్‌ కూడా కుమ్మక్కు అయ్యారని వార్డు సభ్యులు విలేకరులకు తెలిపారు. విచారణ చేసే అధికారి అవినీతి పాల్పడిన వారికి వత్తాసు పలుకుతున్నాడని వార్డు సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై ఎంపీఓ షాజహాన్‌ను వివవరణ కోరగా అవినీతి అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా డీపీఓ వెంకయ్య ఆదేశాల మేరకు విచారణ అధికారిగా వెళ్లి వార్డు సభ్యులు, సర్పంచ్‌, గ్రామస్తులతో మాట్లాడాను. అయితే వారి వద్ద రికార్డులు లేవని, ఒక రోజు సమయం కావాలని కోరగా దానికి అనుమతి ఇచ్చానని వివరించారు.

రొయ్యూర్‌ గ్రామ పంచాయతీలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగినా విచారణకు సిద్ధం. ఆధారాలు ఉంటే చూపించాలి. నేను అవినీతికి పాల్పడితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి.

– కావిరి అర్జున్‌, రొయ్యూరు సర్పంచ్‌

ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వార్డు సభ్యులు

ఒకరోజు సమయమిచ్చి వెనుదిరిగిన ఎంపీఓ షాజహాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement