నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటించాలి

Sep 30 2026 1:22 AM | Updated on Sep 30 2026 1:22 AM

ములుగు: 2026–27 సీజన్‌న్‌లో జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిబంధనలు పాటించాలని కలెక్టర్‌ భోర్కడే హేమంత్‌ సహదేవరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీతో కలిసి కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 135 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. నిబంధనలకు లోబడి మాత్రమే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం గుర్తించిన 7 సన్న రకాల ధాన్యానికి మాత్రమే క్వింటాకు రూ. 500 బోనస్‌ చెల్లించనున్నట్లు వివరించారు. ఏ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాకు రూ.2,461, సీ గ్రేడ్‌ ధాన్యానికి రూ.2,441గా ధర నిర్ణయించినట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యత ప్రమాణాలు, మద్దతు ధర సూచించే బ్యానర్‌ ప్రదర్శించాలని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు, ఆలస్యం కలగకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్పీ రవీందర్‌, డీఆర్‌డీఓ రవీందర్‌, డీసీఓ రాంమోహన్‌, డీఏఓ సురేశ్‌కుమార్‌, డీహెచ్‌ఓ సంజీవరావు, డీఎం, డీసీఎస్‌ఓ కృష్ణవేణి, జిల్లా రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌, సంబంధిత అధికారులు, ఐకేపీ, పీఏసీఎస్‌, జీసీసీ, ఎంసీసీసీ సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు.

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

జిల్లాలోని పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ భోర్కడే హేమంత్‌ సహదేవరావు సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో నిర్వహించిన వరంగల్‌– ఖమ్మం– నల్గొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పట్టభద్రులైన ఓటర్లు ఓటరుగా నమోదు చేసుకోవడంపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం వెలువరించిన నియమ నిబంధనలు, దరఖాస్తు చేసే విధానం, గడువు, తదితర వివరాలను జిల్లా కలెక్టర్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఈ సమావేశంలో డీఆర్‌వో రవికుమార్‌, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ భోర్కడే హేమంత్‌ సహదేవరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement