గడువులోగా పూర్తయ్యేనా! | - | Sakshi
Sakshi News home page

గడువులోగా పూర్తయ్యేనా!

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

ములుగు: ప్రభుత్వ పథకాలు, సేవలను రైతులకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ (ఫార్మర్‌ రిజిస్ట్రీ) ప్రక్రియ లక్ష్యం చేరేలా కనిపించడం లేదు. రైతులకు డిజిటల్‌ గుర్తింపు ఇచ్చేందుకు ఈ ప్రక్రియను చేపట్టారు. రైతు రిజిస్ట్రీలో పేర్లు నమోదు చేసుకునే ప్రతీ రైతుకు 11 అంకెల ప్రత్యేక విశిష్ట సంఖ్యతో ఫార్మర్‌ ఐడీని వ్యవసాయశాఖ అధికారులు కేటాయిస్తున్నారు. పట్టా పుస్తకాల వివరాలను రైతు ఆధార్‌ సంఖ్యతో అనుసంధానం చేసి ఫార్మర్‌ ఐడీ కేటాయిస్తారు. ఇందులో రైతు పేరిట ఉన్న భూమి, పంటల సాగు వివరాలను ప్రభుత్వం రైతు పథకాలతో అనుసంధానం చేయనుంది.

మెరుగైన సేవలు అందించేందుకు..

ఆధార్‌ కార్డు, భూమి పట్టా పాస్‌ పుస్తకం, ఆధార్‌కు లింక్‌ ఉన్న మొబైల్‌ నంబర్‌ వివరాలను రైతు వేదికల్లో ఏఈవోలకు లేదా మీసేవ కేంద్రాల్లో రైతులు అందజేసి ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తే ఐడీ జనరేట్‌ అవుతుంది. రైతుల నుంచి కనీస మద్దతు ధరతో పంటల కొనుగోళ్లు, ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏ యాప్‌తో ఎరువుల విక్రయాలు, పంట రుణాలు, పీఎం కిసాన్‌, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, విపత్తు పరిహారం, సబ్సిడీలు, ఇతర వ్యవసాయ సంబంధిత సేవలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలు చేసే క్రమంలో ఫార్మర్‌ ఐడీని పరిగణనలోకి తీసుకోనున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ 64 శాతం పూర్తికాగా మిగిలిన 36 శాతాన్ని రెండు రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఈ మేరకు రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు చేసుకునే విధంగా జిల్లా వ్యవసాయ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఏఈవోలు తమకు కేటాయించిన గ్రామాలో అందుబాటులో ఉండి రైతుల నమోదుతో పాటు డిజిటల్‌ పంట సర్వే ప్రక్రియ చేపట్టేలా చర్యలు చేపట్టింది.

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌కు రేపే లాస్ట్‌

ఇప్పటి వరకు 64 శాతం మాత్రమే పూర్తి

జిల్లాలో 89,780 మంది రైతులు

ఈనెల 30వ తేదీలోగా

వంద శాతం లక్ష్యం నెరవేరేనా?

మండలం రైతులు రిజిస్ట్రీ పెండింగ్‌

ములుగు 14,640 9,209 5,431

ఏటూరునాగారం 7,263 4,445 2,818

గోవిందరావుపేట 6,621 5,101 1,520

కన్నాయిగూడెం 5,119 3,417 1,702

మల్లంపల్లి 6,187 2,326 3,861

మంగపేట 11,005 6,838 4,167

ఎస్‌ఎస్‌తాడ్వాయి 7,794 5,425 2,369

వెంకటాపురం(ఎం) 12,679 9,038 3,641

వెంకటాపురం(కె) 8,756 5,705 3,051

వాజేడు 9,716 6,399 3,317

రెండురోజులే గడువు..

జిల్లాలోని 10 మండలాల పరిధిలో 89,780 మంది రైతులు ఉండగా వారిలో ఇప్పటివరకు 57,903 మంది రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రీ పూర్తి చేసుకున్నారు. ఇంకా 31,877 మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 64 శాతం పూర్తికాగా మిగిలిన 36 శాతాన్ని రేపటి(30వ తేదీ)లోగా పూర్తి చేయాల్సి ఉంది. రైతులందరూ ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు చేసుకునేందుకు వ్యవసాయశాఖ గత మంగళవారం నుంచి ప్రత్యేక ప్రచార, నమోదు కార్యక్రమం ప్రారంభించింది. వ్యవసాయాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులందరూ ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది. పర్యవేక్షణ బాధ్యతలను ఏడీఏలు, డీఏవోలకు అప్పగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement