మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

● రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క

ములుగు: మహిళా సంఘాల సభ్యులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని వ్యాపార వేత్తలుగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. కలెక్టరేట్‌లోన రెండో అంతస్తులో మెప్మా ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ టీ కేంద్రాన్ని కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు మహిళలకు స్థిరమైన ఉపాధితో పాటు వ్యాపార నిర్వహణలో అనుభవాన్ని అందిస్తాయని తెలిపారు. ఐడీఓసీకి వచ్చే అధికారులు, ఉద్యోగులు, ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించాలని నిర్వాహకులకు సూచించారు. వినియోగదారుల ఆదరణ పొందేలా క్యాంటీన్‌న్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ను

అరెస్ట్‌ చేయాలని ర్యాలీ

ఓటు చోరీ అక్రమాలకు పాల్పడిన సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ను అరెస్ట్‌ చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టి కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి, నాయకులు గొల్లపెల్లి రాజేందర్‌, భగవాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement