వినతులు పరిష్కరించండి.. | - | Sakshi
Sakshi News home page

వినతులు పరిష్కరించండి..

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

ములుగు రూరల్‌/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్‌కు బాధితులు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు సమర్పించారు.. పరిష్కారం తప్పకుండా చూపాలని బాధితులు అధికారులను వేడుకున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తంగా 24 దరఖాస్తులు రాగా నిర్ణీత గడువులోగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో రవికుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో పాల్గొని గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. 63 అర్జీలు రాగా బాధితులను వారివారి సమస్యలపై క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ(జనరల్‌) దామోదరస్వామి, డీడీ జనార్దన్‌, ఈఈ ప్రవీణ, ఎస్‌డీసీ ప్రతాప్‌, డిఫ్యూటీ తహసీల్దార్‌ అనిల్‌ పాల్గొన్నారు.

ప్రజావాణి, గిరిజనదర్బార్‌లో

బాధితుల వేడుకోలు

అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ, పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో

పరిశీలించి దరఖాస్తులు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement