పరిశుభ్రతతోనే సీజనల్‌ వ్యాధులకు అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రతతోనే సీజనల్‌ వ్యాధులకు అడ్డుకట్ట

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

ములుగు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి సీజనల్‌ వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చని కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు అన్నారు. మండల పరిధిలోని మదనపల్లిలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన శ్రీస్వచ్ఛతా హి సేవ–2026శ్రీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇళ్ల పరిసరాల్లో చెత్తాచెదారం, మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఇంటింటా ఆరోగ్య సర్వేను పకడ్బందీగా నిర్వహించి, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేసి సకాలంలో చికిత్స అందించాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు మాట్లాడుతూ మలేరియా, డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఇంటింటా సర్వేతో పాటు దోమల నివారణ మందులు పిచికారీ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి నాగఅన్వేష్‌, వైద్యులు దీప్తి, తరుణ్‌, సూపర్‌వైజర్‌ దేవమ్మ, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

రామప్పలో మాక్‌డ్రిల్‌

వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయంలో సోమవారం ఆక్టోపస్‌, జిల్లా స్పెషల్‌ పార్టీ పోలీసుల ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ప్రముఖ చారిత్రక కట్టడాల్లో ఉగ్రవాదులు, తీవ్రవాదులు లేదా సంఘ విద్రోహశక్తులు చొరబడినప్పుడు వారిని ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంపై సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఈ డ్రిల్‌ నిర్వహించినట్లు స్థానిక ఎస్సై చల్ల రాజు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టాల్సిన చర్యలను ప్రదర్శించారు. ఈ మాక్‌డ్రిల్‌లో ఆక్టోపస్‌ బలగాలతో పాటు జిల్లా స్పెషల్‌ పార్టీ, స్థానిక పోలీస్‌ సిబ్బంది, అగ్నిమాపక శాఖ, అంబులెన్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

ములుగు: ములుగు మున్సిపాలిటీ పరిధిలో 2బీ బార్‌ ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ములుగు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ సీఐ సుస్మిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 1లక్ష రుసుముతో అక్టోబర్‌ 12 వరకు భూపాలపల్లి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయంలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌లో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. ములుగు మున్సిపాలిటీలో తొలిసారిగా 2బీ బార్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించిందని వివరించారు. 2బీ బార్‌కు రూ.30 లక్షలు సంవత్సరానికి ఎకై ్సజ్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. పూర్తి వివరాలకు ములుగు ఎకై ్సజ్‌ శాఖ ఎస్‌హెచ్‌ఓ సెల్‌ నంబర్‌ 8712659012లో సంప్రదించాలని సుస్మిత సూచించారు.

జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక

ములుగు రూరల్‌: జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు బండారుపల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థి గుడెల్లి బాచి ఎంపికయ్యాడు. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 26న నిర్వహించిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో బాచి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపాల్‌ దేవకి విద్యార్థి బాచిని అభినందించి హర్షం వ్యక్తం చేశారు.

వాయిదాపడిన పరీక్షలకు రీషెడ్యూల్‌

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధిలో ఇటీవల వాయిదా వేశారు. ఆయా పరీక్షలను రీషెడ్యూల్‌ చేస్తూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌ సోమవారం టైంటేబుల్‌ విడుదల చేశారు. దూరవిద్య పీజీ రెండో సెమిస్టర్‌ పరీక్షలు అక్టోబర్‌ 7న నిర్వహించనున్నారు. డిగ్రీ రెండో సంవత్సరం పరీక్షలు 8న, డిగ్రీ కోర్సుల ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు 9న నిర్వహించనున్నారు. దూరవిద్య పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు, డిప్లొమా ఇన్‌ గైడెన్స్‌ అండ్‌ కౌన్సెలింగ్‌ పరీక్షలు అక్టోబర్‌ 5న నిర్వహించనున్నారు. దూరవిద్య పీజీ కోర్సుల మూడో సెమిస్టర్‌ పరీక్షలు 7న, దూరవిద్య పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు 9వ తేదీన నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement