ములుగు: ఐక్యత, సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం సాధించేందుకు యాదవులు ఐక్యంగా ఉద్యమించాలని జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు వంగ రవియాదవ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సంఘం సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సమ్మక్క–సారలమ్మ ఆశీర్వాదంతో పోరాటాల గడ్డ అయిన జిల్లా నుంచి ప్రారంభమైన యాదవ సంఘం ఉద్యమాన్ని యాదవులంతా ఐక్యతతో ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో యాదవులంతా భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం యాదవ సంఘం జిల్లా అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడిగా వంగ రవియాదవ్, గౌరవ సభ్యులుగా పిండి రవి, వసంత శ్రీనివాస్, జక్కుల రేవంత్, ఇమ్మడి రాకేశ్, మొగిలి, శ్యామ్, వెంకన్న కుమారస్వామి, అనిల్ ఎన్నికయ్యారు.


