హక్కుల సాధనకు ఉద్యమించాలి | - | Sakshi
Sakshi News home page

హక్కుల సాధనకు ఉద్యమించాలి

Sep 11 2026 11:21 AM | Updated on Sep 11 2026 11:21 AM

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు కామ్రేడ్‌ కొమురయ్య స్ఫూర్తితో ఉద్యమించాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్‌లో బ్రాంచ్‌ కార్యదర్శి మోటపలుకుల రమేష్‌ అధ్యక్షతన కొమురయ్య వర్ధంతిని ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా రాజ్‌కుమార్‌ తదితరులు.. కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లోనూ కొమురయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధన కోసం కొమురయ్య తన జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. నేడు కార్మికులు పొందుతున్న పెన్షన్‌ సాధనలో కొమురయ్య పోరాటం కీలకమైందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ వైస్‌ ప్రెసిడెంట్‌ మాతంగి రామచందర్‌, నాయకులు గురుజేపల్లి సుధాకర్‌రెడ్డి, నూకల చంద్రమౌళి, శ్రీనివాస్‌, ఆసిఫ్‌ పాషా, పోశం, రామచందర్‌, కరీముల్లా, శంకర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement