వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన జాన్ చెర్మక్ ఆదివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామిని ఆయన దర్శించుకోగా అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ వారికి వివరించారు.
మౌలిక వసతులు
కల్పించాలి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని బూర్గుపేట ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ అన్నారు. బూర్గుపేట హాస్టల్‌ను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ పాఠశాలలో సురక్షిత తాగునీరు, ఫ్యాన్లు, కిటికీలు పూర్తిస్థాయిలో లేవని తెలిపారు. వర్షపు నీరు గదుల్లోకి వస్తుందని పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు టీఎల్.రవి, అరవింద్, నరహరి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ రామల సునీత, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, అర్చకులు ఆయనను ఘనంగా స్వాగతించారు. చంద్రశేఖర్ ఆజాద్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. రిటైర్డ్ ఈఓలు జ్ఞాన్‌దేవ్‌రెడ్డి, రాజేంద్రం, మేడారం ఈఓ వీరస్వామి, రత్నాకర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.
పోలీస్ ఉద్యోగాలకు
ఉచిత శిక్షణ
భూపాలపల్లి అర్బన్: పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆది వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అభ్యర్థులకు శారీరక పరీక్షలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 350 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అనంతరం సింగరేణి హైస్కూల్‌లో రాత పరీక్ష నిర్వహించారు. రాత పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పరిశీలించారు. పరీక్షలు రాస్తున్న అభ్యర్థులతో మాట్లాడారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి, అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. శారీరక, రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు 70 రోజులపాటు ఉచితంగా క్లాసులతోపాటు గ్రౌండ్ కోచింగ్ అందిస్తామని అదనపు ఎస్పీ నరేష్‌కుమార్ తెలిపారు. పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులు కష్టపడి చదవడంతోపాటు శారీరకంగా సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఆర్‌ఐలు రత్నం, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.


