హన్మకొండ: రాఖీ పండుగతో టీజీఎస్ ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. వరంగల్ రీజియన్‌లో రెగ్యులర్ బస్సులతో పాటు వివిధ రూట్‌లలో ప్రత్యేక బస్సులు నడిపి పెద్ద సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు రీజియన్ పరిధిలో రెగ్యులర్ బస్సులకు తోడు 386 ప్రత్యేక సర్వీసులు నడిపారు. బస్సులు మొత్తం 12,52,897 కిలోమీటర్లు తిరిగి, 15,44,158 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసి రూ.8,62,41,648 ఆదాయం రాబట్టుకుంది. వరంగల్ ఆర్‌ఎం భవాని ప్రసాద్ నేతృత్వంలో డిప్యూటీ ఆర్‌ఎంలు, డిపో మేనేజర్లు ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా డిమాండ్ ఉన్న రూట్లలో అదనపు, ప్రత్యేక బస్సులు సమకూర్చి సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశారు. అధికారులు బస్టాండ్‌లో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
వరంగల్ రీజియన్ పరిధిలో మూడు రోజుల్లో ప్రయాణికుల చేరవేత, ఆదాయం (రూ.లలో)
తేదీ కిలోమీటర్లు ప్రయాణికులు ఆదాయం
26 3,91,916 4,27,281 2,28,75,620
27 4,16,861 5,16,877 2,83,14,190,
28 4,44,120 6,00,000 3,50,51,838
మూడు రోజులపాటు ప్రత్యేక సర్వీసులు
ఆర్టీసీ ఆదాయం రూ.8,62,41,648
తిరిగిన కిలోమీటర్లు 12,52,897
చేరవేసిన ప్రయాణికులు 15,44,158


