ఎన్‌హెచ్‌పై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌పై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

Aug 30 2026 1:03 AM | Updated on Aug 30 2026 1:03 AM

ములుగు: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అవసరమైన రోడ్డు భద్రతా చర్యలను పటిష్టంగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ సీహెచ్‌.మహేందర్‌జీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో తన ఛాంబర్‌లో ఆయన శనివారం రోడ్డు భద్రతా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ రహదారిపై మల్లంపల్లి, పందికుంట, యువజన శిక్షణ కేంద్రం, జాకారం, నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ప్రాంతాల్లో అవసరమైన ప్రాంతాల్లో వేగ నియంత్రణ పట్టీలు, సూచిక బోర్డులు, రేడియం స్టికర్లు, ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారికి అనుసంధానమయ్యే రహదారుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆయా అనుసంధాన ప్రాంతాల వద్ద వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా సూచిక, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టీఓ ఈశ్వర్‌ సింగ్‌ ఠాగూర్‌, ఎకై ్సజ్‌ సీఐ సుధీర్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌, నేషనల్‌ హైవే, ఆర్‌అండ్‌బీ, పీఆర్‌, ఇంజనీరింగ్‌ అధికారులు, ఆర్టీసీ, పోలీస్‌, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement