ములుగు రూరల్: మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై చైర్‌పర్సన్ చంద్రకళ, కౌన్సిలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం జాతీయ రహదారిపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా చెత్త సేకరణకు 10 ఆటోలు, డోజర్ వాహనం కొనుగోలుకు ప్రభుత్వం రూ.1.25 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. దీంతో పాటు మరో రూ. 30 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించినట్లు వెల్లడించారు. మున్సిపాలిటీకి నిధుల మంజూరుకు సహకరించిన మంత్రి సీతక్క, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ ఆసియా షాహిన, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సీఎం, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం


