ఏటూరునాగారం: ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ప్రయాణికులు బెంబేలుఎత్తుతున్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఆర్టీసీ పండుగ దోపిడీకి తెరలేపింది. ఉగాది పండుగకు ప్రయాణికులు బస్సులను ఆశ్రయిస్తారని ముందే గ్రహించిన ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల జేబులుకు చిల్లులు పెడుతున్నారు. హనుమకొండ నుంచి ఎలక్ట్రికల్ బస్సులో ఏటూరునాగారానికి గతంలో ఒక ప్రయాణికుడికి ఫుల్ టికెట్ రూ. 190లు వసూలు చేశారు. కానీ ఉగాది పండుగ ఆఫర్ అంటు దోపిడీకి రూపకల్పన చేశారు. ఒక్కో ప్రయాణికుడి వద్ద రూ. 270 లు వసూలు చేయడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన జేపాల్ తన కుటుంబంతో కలిసి వస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు ప్రయాణించగా రూ.810లు చెల్లించి బస్సులో ప్రయాణించాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బస్సులోని కండక్టర్‌ను ప్రయాణికులు ప్రశ్నించగా పండుగ సందర్భంగా కంట్రోలర్ తమకు రూ. 270లు తీసుకోవాలని ఆదేశించారని వెల్లడించారు. హనుమకొండ నుంచి ములుగు రూ. 120, హనుమకొండ నుంచి ఏటూరునాగారానికి రూ.270 తీసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఎలక్ట్రికల్ బస్సు హనుమకొండ టు
ఏటూరునాగారం రూ.190
ఉగాది పండుగ పేరుతో
రూ. 270 చార్జ్ వసూలు
లబోదిబోమంటున్న ప్రయాణికులు


