● కలెక్టర్ టీఎస్.దివాకర
ములుగు రూరల్: భూముల రీ సర్వేకు రాంచంద్రాపూర్ రైతులు సహకరించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు బుధవారం మల్లంపల్లి మండల పరిధిలోని రాంచంద్రాపూర్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంచంద్రాపూర్ శివారులో భూ వివాదాల కారణంగా రైతులకు పట్టాలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందుకు శాశ్వత పరిష్కారంగా భూముల సర్వే చేపడుతున్నట్లు వివరించారు. శివారులో 10,500 ఎకరాల వ్యవసాయ భూమికి సర్వే నిర్వహించినట్లు తెలిపారు. 9 బ్లాక్‌లుగా ఏర్పాటు చేసి సర్వే చేపట్టి రోజుకు 50 నుంచి 75 మంది పట్టాదారుల భూములను సర్వే చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేశ్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, రాంచంద్రాపూర్, దేవనగర్, భూపాల్‌నగర్, గుర్తూర్‌తండా సర్పంచ్‌లు దొంతి స్వరూప, సంతోష్, రమణారెడ్డి, రాజునాయక్, భాస్కర్, సంబంధిత శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం, ఏటూరునాగారం మండలం రొయ్యూర్‌కు చెందిన విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల విద్యార్థులు పది మంది గుమికూడి దాడి చేసుకున్నారు. ఈ విషయం విద్యార్థులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల నిరంతర పెట్రోలింగ్ లేకపోవడంతోనే ఆకతాయిల చేష్టలు మితిమీరిపోతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.


