టీకా స్పెషల్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

టీకా స్పెషల్‌ డ్రైవ్‌

Mar 17 2026 7:28 AM | Updated on Mar 17 2026 7:28 AM

చికిత్స ఇలా.. టీకాలు సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా వివరాలు

వ్యాధి సోకిన పశువులకు ఆరోగ్య పరీక్షలు తప్పకుండా చేయించాలి. నోరు, పెదాల, నాలుక, కాళ్ల గిట్టలను పొటాషియం పర్మాంగనేట్‌ లేదా సైలెన్‌ వాటర్‌తో శుభ్రం చేయాలి. రెండోసారి వ్యాధి సోకకుండా యాంటిబయాటిక్‌ మందులను, పశువుల్లో వ్యాధి నిరోదక శక్తి పెంచడానికి బీ కాంప్లెక్స్‌ మందులను వాడాలి. గాలికుంటు వ్యాధిపై రైతులు నిర్లక్ష్యం వహించకూడదు. వైద్యుల సలహాల మేరకు క్రమం తప్పకుండా ఏడాదికి రెండు సార్లు టీకాలు వేయించుకోవాలి. గాలికుంటు వ్యాధి ప్రాణాంతకం కావడంతో అలసత్వం వహిస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

ములుగు రూరల్‌: గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉచిత టీకాలను పంపిణీ చేస్తున్నాయి. పశువుల సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా అందిస్తుంది. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతులకు గాలికుంటు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధిపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా టీకాలు వేయించుకోవాలి. వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమ రంగాలలో గాలికుంటు వ్యాధితో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో ఏప్రిల్‌ 9వ తేదీ వరకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలోని పది మండలాల్లో ఉచిత టీకా స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా 34 బృందాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,8 లక్షల పశువులకు ఉచిత టీకాలు అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు 38,880 పశువులకు టీకాలు వేసినట్లు అధికారులు వెల్లడించారు.

వ్యాధి లక్షణాలు

గాలికుంటు వ్యాధి సూక్ష్మ క్రిములతో వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. వ్యాధి సోకిన గేదెలు, ఆవులు ఆహారం సరిగా తీసుకోకపోవడంతో బక్కచిక్కి పోతాయి. పశువులు రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం భారిన పడి నోరు, పెదాలు, నాలుక, కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి అనతి కాలంలోనే వ్యాధి ముదిరి పోతుంది. దీంతో పశువులు మేత, నీరు తీసుకోకపోవడంతో రోగ నిరోధక శక్తి తగ్గి పశువులు, దూడలు చనిపోయే ప్రమాదం ఉంటుంది.

వ్యాధి సోకిన పశువులను..

గాలికుంటు వ్యాధి సోకిన శువులను ఇతర పశువులతో కాకుండా వేరు చేయాలి. ఎప్పటికప్పుడు పశువుల పాకను శుభ్రం చేయాలి. వారానికి ఒక సారి కొట్టంలో సున్నం చల్లి క్రిమికీటకాల నివారణకు చర్యలు పాటించాలి. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీ సెల్సియస్‌ వరకు వేడి చేసిన తర్వాత వినియోగించాలి. వ్యాధిసోకిన పశువులు మృతి చెందితే గోతిలో వేసి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి పాతిపెట్టాలి.

పశువుల్లో సోకే గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాధి సోకకుండా ముందస్తుగా వ్యాక్సిన్‌ వేయించుకోవడంతో పశుసంరక్షణ బాగుంటుంది. వ్యాధి బారిన పడిన పశువులను గుర్తించి ఆస్పత్రిలో చికిత్స అందించాలి. గ్రామాల వారిగా వ్యాక్సినేషన్‌ చేపడుతున్నాం. ముందుగా రైతులకు సమాచారం అందిస్తున్నాం.

– కొమురయ్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి

మూగజీవాలకు

గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

జిల్లాలో 34 బృందాలు, 1.08 లక్షల జీవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement