వినతులు
గిరిజన దర్బార్‌లో ఇలా..
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో బాధితుల నుంచి స్వీకరించిన అర్జీలను పరిశీలించిన అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఐటీడీఏ డీడీ జనార్దన్ తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో 46 వినతులు రాగా అదనపు కలెక్టర్ సంపత్‌రావు స్వీకరించారు. అలాగే ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో 11 వినతులు రాగా డీడీ జనార్దన్, ఏవో రాజ్‌కుమార్‌లు స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించొద్దని అధికారులకు సూచించారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి మండల పరిధిలోని భూపతిపురానికి చెందిన రైతు, వాజేడు మండలం గుమ్మడిదొడ్డికి చెందిన మరో రైతు ఇందిర సౌర జలగిరివికాసం కింద బోరు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యాపురంలో కంటేజెంట్ వర్కర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి 28 నెలలుగా వేతనం రావడం లేదని ఇప్పించాలని కోరారు. కన్నాయిగూడెం మండలం కంతనపల్లికి చెందిన రైతు రైతుబంధు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. వెంకటాపురం మండలం ఎదిర గ్రామానికి చెందిన ప్రజలు పెసా గ్రామసభ నిర్వహించాలని కోరారు. మిగిలిన వారు ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్(ఎస్‌డీసీ)అనిల్, మేనేజర్ శ్రీనివాస్, ఎం.కొండల్‌రావు, కొమురం ప్రభాకర్, వై.కిశోర్, జగన్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్
సంపత్‌రావు, ఐటీడీఏ డీడీ జనార్దన్
ప్రజావాణిలో 46,
గిరిజన దర్బార్‌లో 11 వినతులు స్వీకరణ


