పుష్కరఘాట్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు
మేడారంలో రాతి కట్టడాలు
● అదనపు కలెక్టర్ సంపత్ రావు
● జంపన్నవాగులో నిరంతరం గోదావరి నీరు
● రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
వాజేడు: మండలంలో పుష్కర ఘాట్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించాలని అదనపు కలెక్టర్ సంపత్‌రావు అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. వచ్చే ఏడాది జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాలకు వాజేడు, పేరూరు గ్రామాల వద్ద పుష్కర ఘాట్లకు అనువైన ప్రదేశాలను అధికారులతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. మండలంలో రెండు పుష్కర ఘాట్లు కొత్తగా నిర్మించాల్సి ఉండగా పనులు చేపట్టాలన్నారు. అందుకు సంబంధించి తాగునీరు, మరుగు దొడ్లు, విద్యుత్ లైన్, పార్కింగ్ ప్రదేశం తదితర పనుల ప్రారంభంపై ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వాటి నిర్మాణాలకు ఖర్చు అంచనా విలువలతో నివేదికలను అందజేయాలని కోరారు. అలాగే చండ్రుపట్ల గ్రామంలో పుష్కరఘాట్ ఏర్పాటు చేయాలని పరిశీలించగా అనువైన ప్రదేశం లేకపోవడంతో పేరూరులో పరిశీలించి ప్రతిపాదనలను వెంటనే అందజేయాలన్నారు. ఆయన వెంట నాగారం సర్పంచ్ స్వరూప, ఎంపీడీఓ విజయ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ శ్రీకాంత్ నాయుడు, ఆర్‌ఐ కుమార స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
పుష్కరఘాట్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు


