నేడు హేమాచలక్షేత్రానికి మంత్రుల రాక | - | Sakshi
Sakshi News home page

నేడు హేమాచలక్షేత్రానికి మంత్రుల రాక

Mar 1 2026 7:25 AM | Updated on Mar 1 2026 7:25 AM

నేడు

నేడు హేమాచలక్షేత్రానికి మంత్రుల రాక

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని మంత్రులు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేడు(ఆదివారం) దర్శించుకోనున్నారు. నేటి ఉదయం మేడారం నుంచి హేమాచలక్షేత్రానికి ఉదయం 8 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇద్దరు మంత్రులు హేమాచల క్షేత్రానికి రానుండటంతో ఆలయ కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్‌, మంగపేట ఎస్సై ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయనున్న చేయనున్నారు.

ఉద్యోగ విరమణ సహజం

ములుగు రూరల్‌: ప్రతీ ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు. వెంకటాపురం(ఎం) పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ఎస్సై రాంసింగ్‌ను జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో శనివారం శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 35 ఏళ్ల పాటు పోలీస్‌శాఖకు తన సేవలు అందించారని తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని వివరించారు. ఉద్యోగ విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌, ఆర్‌ఐ వెంకటనారాయణ, వెంకటాపురం(ఎం)ఎస్‌హెచ్‌ఓ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఏజెన్సీ చట్టాలను

పటిష్టంగా అమలుచేయాలి

వెంకటాపురం(కె): ఏజెన్సీ ప్రాంతంలోని చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ జిల్లా కన్వీనర్‌ పర్శిక సతీష్‌ అన్నారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక క్వారీల్లో పెసా చట్టం నియమ నిబంధనలు పాటించాలన్నారు. కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తూ 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో ఇసుకను డంపింగ్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు కృష్ణబాబు, తాటి రాంబాబు, నవదీప్‌, నాగరాజు, మల్లయ్య పాల్గొన్నారు.

చంద్రవాహన సేవలో..

కోటంచలో కొనసాగుతున్న

బ్రహ్మోత్సవాలు

రేగొండ: మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉదయం నిత్యనిధి, హోమం నిర్వహించిన అనంతరం స్వామి వారిని గజవాహన సేవలో మాడవీధుల గుండా ఊరేగించారు. సాయంత్రం బలిహరణ సేవ నిర్వహించిన అనంతరం స్వామి వారిని చంద్రవాహన సేవలో డప్పువాయిద్యాల నడుమ మాడవీధుల గుండా ఊరేగించారు. అనంతరం తీర్థప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ నాయినేని సంపత్‌రావు, ఆలయ ఈఓ మహేష్‌, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది శ్రావణ్‌, సుధాకర్‌, రవిందర్‌, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

నేడు హేమాచలక్షేత్రానికి మంత్రుల రాక
1
1/2

నేడు హేమాచలక్షేత్రానికి మంత్రుల రాక

నేడు హేమాచలక్షేత్రానికి మంత్రుల రాక
2
2/2

నేడు హేమాచలక్షేత్రానికి మంత్రుల రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement