దివ్యాంగులకు మరింత భరోసా ఇవ్వాలి
● ఎన్‌హెచ్‌సీ డీపీఎం కమల
ఏటూరునాగారం: మండలంలోని దివ్యాంగులకు ఎన్‌హెచ్‌సీ సెంటర్ మరింత భరోసా ఇవ్వాలని ఎన్‌హెచ్‌సీ డీపీఎం(జిల్లా ప్రాజెక్టు మేనేజర్) కమల అన్నారు. మండల కేంద్రంలోని ఎన్‌హెచ్‌సీ సెంటర్‌ను ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్‌లోని పిల్లలకు సిబ్బంది అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్‌హెచ్‌సీ సెంటర్ లేకపోవడం వల్ల దివ్యాంగుల్లో మార్పులేకుండా ఉండేదని, ఇప్పుడు మానసిక, శరీర మార్పులు, ఎదుగుదల కనిపిస్తుందని తెలిపారు. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు రెన్యూవల్స్ త్వరగా చేయించుకోవాలని సూచించారు. అలాగే మండలంలోని దివ్యాంగుల పొదుపు సంఘంతో అధికారులు సమావేశమై పొదుపు చేయడం వల్ల కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం పీడబ్ల్యూడీ కృష్ణవేణి, ఏపీఎం కొప్పుల శ్రీధర్‌రెడ్డి, ఎన్‌హెచ్‌సీ సెంటర్ సీసీ నర్సింహరావు, సిబ్బంది పాల్గొన్నారు.


