ఏఐ మనిషికి ప్రత్యామ్నాయం కాదు
ములుగు: పరిశోధన రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవుడికి ప్రత్యామ్నాయం కాదని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అకడమిక్ డీన్, ప్రొఫెసర్ జి.రామిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, వాణిజ్యశాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో ఎంపవరింగ్ రీసెర్చ్ ఎక్సలెన్స్– ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టూల్స్ ఫర్ అకడమిక్ రైటింగ్ అండ్ పబ్లిషింగ్ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమకాలిన మానవ జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒక విప్లవాత్మకమైన పరిణామమన్నారు. పరిశోధన రంగంలో నైతికంగా వినియోగించుకున్నప్పుడు మాత్రమే పరిశోధన ఫలితాలకు సార్థకత ఉంటుందన్నారు. అనంతరం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ వరలక్ష్మి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల ప్రవేశంతో పరిశోధన రంగం అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడమే కాకుండా పరిశోధన రంగంలో విశ్వమే ఒక గ్రామంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కొప్పుల మల్లేశం, సెమినార్ కన్వీనర్ డాక్టర్ బి.జగదీష్, సెమినార్ కోకన్వీనర్ డాక్టర్ సిహెచ్.భాస్కర్, ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ బి.రాధికారాణి, ప్రిన్సిపాల్స్ చంద్రమౌళి, శ్రీనివాస్, విజయలక్ష్మి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్
యూనివర్సిటీ అకడమిక్ డీన్ రామిరెడ్డి


