గట్టమ్మ ఆలయ హుండీల లెక్కింపు
ములుగు రూరల్: మేడారం మహాజాతర సందర్భంగా గట్టమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన హుండీలను శుక్రవారం లెక్కించారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఈఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరిశీలకుడు అనిల్‌కుమార్ సమక్షంలో లెక్కింపు జరిగింది. గట్టమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.13,06,463 వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ యుగేందర్‌రెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్లు, పూజారులు కొత్త సద య్య, కొత్త లక్ష్మయ్య, అరిగెల సమ్మయ్య, మొగిలి, పుష్పలత, శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ములుగు: జిల్లాలోని ప్రతీ మహిళా సంఘంలో ఉన్న సభ్యురాలికి రుణాలు అందించాలని, సంఘ సభ్యులు మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిన పడకుండా చూడాలని సీ్త్ర నిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో సీ్త్ర నిధి, సెర్ప్ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడారు. సీ్త్ర నిధి నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.22 కోట్లకు గాను ఇప్పటికే రూ.12 కోట్లు అందించామని, ఈ నెల చివరిలోగా మిగిలిన రుణాలను అందిస్తామన్నారు. మేడారం జాతరలో భాగంగా ప్రత్యేక జీవన ఉపాధిని గుర్తించి వారికి సరైన సమయంలో రుణ సౌకర్యం కల్పించి ఆదాయ అభివృద్ధికి ప్రత్యేక రుణాలు అందించినందుకు సిబ్బందిని అభినందించారు. అనంతరం ములుగు అడిషనల్ కలెక్టర్ సంపత్‌రావు మాట్లాడుతూ శ్రీనిధి సంస్థ ద్వారా ఇప్పటివరకు జిల్లాలో వివిధ రకాల రుణాలు మంజూరు చేశామన్నారు. బకాయి ఉన్న సంఘ సభ్యుల నుంచి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి బకాయి లేకుండా రికవరీ అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్, అడిషనల్ డీఆర్డీఓ గొట్టే శ్రీనివాస్, శ్రీనిధి జోనల్ మేనేజర్ రవికుమార్, ఆర్‌ఎం అశోక్, డీపీఎంలు గడ్డం శ్రీనివాస్, రాజు, దేవానంద్ పాల్గొన్నారు.
ఏటూరునాగారం: విద్యార్థులు శిక్షణ సమయంలో నైపుణ్యాలు, క్రమశిక్షణ, ఉత్తమ భవిష్యత్ లక్ష్యంగా ముందుకు సాగాలని 2024 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన ట్రైనీ అధికారి ప్రథమేష్ కేశవ్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ఆర్‌ఐటీఐ, ఏటీసీ, శివాపురంలోని సబ్బుల పరిశ్రమను సందర్శించారు. శిక్షణకు ఉపయోగపడే పరికరాలను పరిశీలించారు. రిపేర్లు, తయారీ, నిర్మాణం విధానాలను అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. మహిళా గ్రూపు సభ్యులతో మాట్లాడి ఉత్పత్తులు ఏ మేరకు అవుతున్నాయని, ఆదాయం ఏ విధంగా ఉందని తెలుసుకున్నారు. అంతేకాకుండా ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అమలవుతున్న పథకాలు, వాటి విధానం, క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు జరుగుతున్నాయని ఐటీడీఏ ఏపీఓ వసంతరావును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్‌ఓ సురేష్‌బాబు, జీసీసీ డీఎం వాణి, జేడీఎం కొండల్‌రావు, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు.
ములుగు రూరల్: కాకతీయ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ యూత్ పెస్టివల్‌లో బండారుపల్లి మోడల్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులను మంత్రి డాక్టర్ దనసరి సీతక్క, కలెక్టర్ టీఎస్ దివాకరలు వేర్వేరుగా అభినందించారు. పోరిక యువరాణి పోస్టర్ పెయింటింగ్‌లో ప్రథమ, భూక్య హేమలత సోలో సాంగ్స్‌లో ద్వితీయ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వందన, ఎస్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కన్వీనర్ ప్రసన్‌కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ పాల్గొన్నారు.
గట్టమ్మ ఆలయ హుండీల లెక్కింపు
గట్టమ్మ ఆలయ హుండీల లెక్కింపు


