
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి
ములుగు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని మెపా రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ యువత అధిక సంఖ్యలో పోటీ చేసి సత్తా చాటాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అమలు చేయాలన్నారు. ముదిరాజ్‌లు ఐక్యమత్యంతో ఉండి రాజకీయంగా ఎదగాలన్నారు. బీసీ కులాలకు మెపా సంఘం మద్దతుగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్న రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు, భూమ నరేష్, రాజు, కౌశిక్, కిరణ్, వంశీ, రమేష్, సలేందర్ తదితరులు పాల్గొన్నారు.
మెపా రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్