నేటి ప్రజావాణి రద్దు | - | Sakshi
Sakshi News home page

నేటి ప్రజావాణి రద్దు

Aug 18 2025 5:43 AM | Updated on Aug 18 2025 5:43 AM

నేటి

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు నేడు మంత్రి సీతక్క పర్యటన సాక్షి ఫొటోగ్రాఫర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేయాలి నేడు రెండో వార్షికోత్సవం అవయవ దానానికి ముందుకురావాలి

ములుగు రూరల్‌: నేడు(సోమవారం) కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ దివాకర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు అధికంగా ఉండడం, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడ ంతో ప్రజావాణి రద్దు చేసినట్లు వివరించారు.

ములుగు రూరల్‌: నేడు రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క మండలంలో పర్యటించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని ఇంచెర్లలో గ్రామంలో రూ. 37 కోట్లతో నిర్మిస్తున్న ఎత్నిక్‌ విలేజ్‌, డెవలప్‌మెంట్‌ వర్క్స్‌, ఫౌండేషన్‌ స్టోన్‌ పనులను మంత్రి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సీతక్కతో పాటు పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి హాజరుకానున్నట్లు వివరించారు. ప్రజలు, కార్యకర్తలు తరలిరావాలని అశోక్‌ కోరారు.

హన్మకొండ కల్చరల్‌/జనగామ: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాక్షి ఫొటోగ్రాఫర్లను రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక చేశారు. వరంగల్‌కు చెందిన సాక్షి సీనియర్‌ స్టాఫ్‌ ఫొట్రోగాఫర్‌ పెద్దపల్లి వరప్రసాద్‌, జనగామ ఫొటోగ్రాఫర్‌ గోవర్ధనం వేణుగోపాల్‌ ఉత్తమ వార్త చిత్రాల పోటీల్లో బహుమతులకు ఎంపికయ్యారు. తెలంగాణ స్టేట్‌ ఫొటో జర్నలిస్ట్‌స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు.

ములుగు రూరల్‌: మల్లంపల్లి– ములుగు మధ్య గల జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పందికుంట, రాంచంద్రాపూర్‌ గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డ భద్రయ్య మాట్లాడుతూ జాతీయ రహదారిపై బ్రిడ్జి కుంగిపోవడంతో శ్రీనగర్‌ మీదుగా ఇసుక లారీలను మళ్లించడంతో గ్రామంలో రోడ్లు పూర్తిగా ధ్వంసమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాత్కాలికంగా పనులు చేపట్టి ద్విచక్ర వాహనాలను, కార్లకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో భారీ వాహనాల కారణంగా గ్రామాల్లోని రోడ్లు గుంతలమయంగా మారాయని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన నందీశ్వరుడికి ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రెండవ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో నందీశ్వరుడు పూర్తిగా ధ్వంసం కావడంతో దాతల సహాయంతో రెండు సంవత్సరాల క్రితం విగ్రహం ఏర్పాటు చేశారు. నందీశ్వరుడికి త్రివేణి సంగమం జలాలతో అభిషేకం, రుద్రాభిషేకం, గణపేశ్వరుడికి బిల్వార్చన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరు కావాలని కోరారు.

భూపాలపల్లి అర్బన్‌: శరీర, అవయవ దానానికి ముందుకురావాలని అమ్మ నేత్ర, అవయన, శరీరదాన ప్రోత్సాహకాల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఈశ్వరలింగం కోరారు. ఆత్మీయత సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరలింగం మాట్లాడుతూ.. నేత్ర, అవయవ, శరీరదానాలపై ఉన్న మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. శరరీ, అవయవ దానాలు చేస్తే మరికొంత మంది ప్రాణాలను కాపాడిన వారిగా గుర్తింపు పొందుతారన్నారు. అనంతరం అవయవదాన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సేవా సొసైటీ అధ్యక్షుడు మహేందర్‌, సభ్యులు క్రాంతికుమార్‌, షాకీర్‌, తిరుపతి, శ్రీనివాస్‌, కుమారస్వామి పాల్గొన్నారు.

నేటి ప్రజావాణి రద్దు
1
1/2

నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు
2
2/2

నేటి ప్రజావాణి రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement