
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
న్యూస్‌రీల్
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి
జాతీయ జెండాకు అభివాదం చేస్తున్న మంత్రి సీతక్క
ములుగు రూరల్: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి జంగాలపల్లి క్రాస్‌లో రూ.2.16 కోట్లతో ఏర్పాటు చేసిన నంది విగ్రహం, ఢమరుకం, శిలాశాసన మండపాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు.. జిల్లాలో పర్యాటక ప్రదేశాల ప్రత్యేకతను చాటుతూ ప్రధాన కూడళ్లలో సుందరీకరణ పనులు చేపడుతూ అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.
ములుగు రూరల్: ఆదివాసీ నాయకపోడు సంఘం ఆధ్వర్యంలో గట్టమ్మ ఆలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడు జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
వెంకటాపురం(కె): మండల పరిధిలోని కమ్మరిగూడెం గ్రామంలో గుండె సంబంధిత వ్యాధితో రెండో తరగతి చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోకల గంగయ్య, లక్ష్మి కుమారుడు తోకల నితీశ్‌కుమార్(6)కు పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధి ఉంది. శుక్రవారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వెళ్లేందుకు తయారవుతున్న సమయంలో ఒక్కసారిగా నొప్పి వచ్చి ఇంట్లో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంకటాపురం వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహిస్తుండగా మృతిచెందాడు.
మల్హర్: కొయ్యూరు, వల్లెకుంట గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై శుక్రవారం కొయ్యూరు పోలీసులు దాడులు నిర్వహించారు. వల్లెకుంట గ్రామంలో ఇంట్లో నిల్వ ఉంచిన 20లీటర్లు, 14లీటర్లు గుడుంబాను స్వాదీనం చేసుకొని గుడుంబా తయారీ సామగ్రిని ధ్వంసం చేసినట్లు కొయ్యూరు ఎస్సై నరేశ్ తెలిపారు. రఘు, లక్ష్మికోయ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై 2 రజన్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుంచి 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు శ్రీకారం చుట్టామని మంత్రి సీతక్క చెప్పారు. అటవీప్రాంతాలలో తక్షణ వైద్య సహాయం అందించేందుకు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నూతన ఆలోచనతో జిల్లాలో 3 తాత్కాలిక కంటైనర్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి 4,182 మంది పేద గిరిజనులకు పరీక్షలు నిర్వహించామన్నారు. జిల్లా ఆసుపత్రిలో జనరల్ సర్జరీ విభాగంలో క్యాన్సర్ శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈనెల ఇద్దరికి రొమ్ము కణితి, ఒకరికి దవడ కణితి విజయవంతంగా తొలగించి మెరుగైన వైద్యసేవలు అందించినందుకుగాను వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు శాఖలకు చెందిన అధికారులకు ప్రశంసపత్రాలను సీతక్క అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు ఎస్పీ సదానందం, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడిని సన్మానిస్తున్న మంత్రి సీతక్క
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క
జంగేడు స్టేడియంలో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవం

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025