గిరిజనులకు మంచిరోజులు | - | Sakshi
Sakshi News home page

గిరిజనులకు మంచిరోజులు

Aug 16 2025 7:29 AM | Updated on Aug 16 2025 7:29 AM

గిరిజ

గిరిజనులకు మంచిరోజులు

ఏటూరునాగారం: గిరిజనులకు మంచి రోజులు వచ్చాయని, స్థానికంగా మంత్రి సీతక్క ద్వారా అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చిత్రామిశ్రా కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల్లో కెల్లా ఏటూరునాగారం ఐటీడీఏ అభివృద్ధిలో ముందజలో ఉందన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను పీఓ ఎగురవేశారు. ముందుగా స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ పీఓకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం గిరిజనుల ఉద్దేశించి పీఓ మాట్లాడుతూ.. 2026లో జరిగే మేడారం జాతర కోసం 21 శాఖలకు గాను రూ.150కోట్లతో గిరిజన సంక్షేమశాఖ ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేశామన్నారు. ఇందులో రూ.10కోట్లు గిరిజన సంక్షేమశాఖ విభాగానికి మంజూరు కోసం ప్రతిపాదనలు చేశామన్నారు. 2024–25లో ఎన్‌ఐటీ, ఐఐటీలో సీటు వచ్చిన 38 మంది గిరిజన విద్యార్థులకు రూ.15.96లక్షలను అందించామన్నారు. 28 మందికి రూ.12.45లక్షల విలువ చేసే లాప్‌ట్యాప్‌లు ఇచ్చామన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఐటీడీఏ ద్వారా 8 బంజారా భవనాలు నిర్మించామన్నారు.

జిల్లాలో గిరిజనుల లబ్ధి కోసం ట్రైకార్‌ పథకం ద్వారా 2020–21, 2021–22గాను 889 యూనిట్లకు రూ.778.13 లక్షలు మంజూరయ్యాయన్నారు. అందులో 208 మందికి సబ్సిడీ మంజూరు కాగా అందులో 125 యూనిట్లకు రూ.కోటి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. గిరి వికాసంలో 2025–26 నుంచి 2029–30 వరకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల రైతులకు సోలార్‌ పంపు సెట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం 525 మందిని ఎంపిక చేసి వారికి సోలార్‌ పంపు సెట్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. పోడు భూములకు పట్టాలు, రైతు భరోసా వంటివి ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం విధుల్లో ఉత్తమంగా పనిచేసిన ఉద్యోగులకు ప్రశంసపత్రాలను అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, ఎస్‌ఓ రాజ్‌కుమార్‌, జీసీసీ డీఎం వాణి, మేనేజర్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఓ సురేశ్‌బాబు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ సంతోష్‌, ప్రోగ్రాం మేనేజర్‌ మహేందర్‌, పెసా కోఆర్డినేటర్‌ ప్రభాకర్‌, జేడీఎం కొండల్‌ రావు, ఆర్‌సీఓ హరిసింగ్‌, ఏఎంఓ వాగ్యా, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందంతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

అభివృద్ధిలో ఏటూరునాగారం ఐటీడీఏ ముందంజ

79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పీఓ చిత్రామిశ్రా

గిరిజనులకు మంచిరోజులు1
1/3

గిరిజనులకు మంచిరోజులు

గిరిజనులకు మంచిరోజులు2
2/3

గిరిజనులకు మంచిరోజులు

గిరిజనులకు మంచిరోజులు3
3/3

గిరిజనులకు మంచిరోజులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement