
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ములుగు రూరల్ : తమ సమస్యలను పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రి సీతక్కకు క్యాంప్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బంద్ పెడతామని అన్నారు. ప్రభుత్వం మెనూ ధరను సవరించి ప్రతీ విద్యార్థికి రూ.25లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ముత్యాల రాజు, సాయల రమ, రాజకుమారి, ప్రమీల, సరోజన, లక్ష్మి, రామక్క, సవరూప, మల్లక్క రజిత, తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ నాయకుడు జంపాల రవీందర్
మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేత