దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకుసాగాలి
ములుగు: దివ్యాంగులు అత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో దివ్యాంగులకు వాహనాల పంపిణీని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగత్వం అంటే కేవలం ఒక విభాగానికి పరిమితమని, దాన్ని మనస్సు దాక రానివద్దని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉపకరణాలను వినియోగించుకుంటూ లక్ష్యాల సాధనకు ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. దివ్యాంగులకు విద్యాపరమైన అంశాల్లో 4 శాతం, సంక్షేమ పథకాల్లో 5శాతం రిజర్వేషన్ కల్పి స్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, జిల్లా సంక్షేమ అధికారి శిరీష, ఎంపీడీఓ రామకృష్ణ పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచాలి
గోవిందరావుపేట: ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచాలని మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని చల్వాయి మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను బుధవారం మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఇంటెలిజెన్స్ ద్వారా విద్యాబోధన చేయడానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, డీఈఓ పాణిని, కోర్సు కో ఆర్డీనేటర్ మల్లారెడ్డి, సెంటర్ ఇన్‌చార్జ్‌లు జయదేవ్, రాజు, సాంబయ్య పాల్గొన్నారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
మంత్రి సీతక్క


