నీడల్లే నేను తోడు ఉండనా... | Zigra Movie Trailer release | Sakshi
Sakshi News home page

నీడల్లే నేను తోడు ఉండనా...

Sep 30 2024 1:51 AM | Updated on Sep 30 2024 1:51 AM

Zigra Movie Trailer release

‘అంకుర్‌ నువ్వు ఏమన్నా చేశావా? నువ్వు ఏదన్నా టచ్‌ చేశావా? ఏదన్నా తిన్నావా ఓకే... కబీర్‌ నీ ఫోన్‌తో ఏమైనా కాల్స్‌ చేశాడా? లేదుగా? బ్లడ్‌ శాంపిల్స్‌ తీస్తే క్లీన్‌ వస్తుంది కదా... నువ్వేం భయపడకు... నీకేం కానివ్వను’ అని ఆలియా భట్‌ పలికే సంభాషణలతో ‘జిగ్రా’ సినిమా తెలుగు ట్రైలర్‌ విడుదల అయింది. ఆలియా భట్, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘జిగ్రా’. అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో వాసన్‌ బాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. 

ఈ చిత్రంలో సత్య పాత్రలో ఆలియా, అంకుర్‌ పాత్రలో వేదాంగ్‌ నటించారు. కరణ్‌ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్‌ భట్, సోమెన్‌ మిశ్రా నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 11న విడుదల కానుంది. ‘జిగ్రా’ చిత్రాన్ని తెలుగులో ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా హీరో రానా విడుదల చేస్తున్నారు. ఆదివారం ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్‌ షేర్‌ చేశారు. ఇంకా ఈ ట్రైలర్‌లో ‘దారే లేకున్నా... నీ వెంట నీడల్లే నేను తోడు ఉండనా... ఏమైనా కానీ... ఏ పిడుగే రానీ నేను తోడు ఉండనా...’ అనే పాట కూడా వినిపిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement