
శృతిక సముద్రాల.. 20 ఏళ్లకే 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' విన్నర్ టైటిల్ పొందింది. ఆరేళ్లకే సంగీతంలో అడుగు పెట్టిన శ్రుతిక సముద్రాల 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' ఫినాలే కార్యక్రమంలో 'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో అదరగొట్టింది.
Zee Saregamapa Winner Shruthika Samudrala Interesting Comments: శృతిక సముద్రాల.. 20 ఏళ్లకే 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' విన్నర్ టైటిల్ పొందింది. ఆరేళ్లకే సంగీతంలో అడుగు పెట్టిన శ్రుతిక సముద్రాల 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' ఫినాలే కార్యక్రమంలో 'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో అదరగొట్టింది. అంతేకాకుండా విన్నర్ కాకముందే పలు బహుమతులను కూడా గెలుచుకుంది. ఫినాలేకు 8 మంది ఫైనలిస్ట్‌లు చేరగా, అందులో అత్యత్భుదమైన ప్రదర్శన కనబరిచి టైటిల్ ట్రోఫీని సొంతం చేసుకుంది.
అయితే తను ఈ పోటీలో గెలవడానికి వాళ్ల అమ్మ ఎంతో సపోర్ట్ చేసిందని చెప్పుకొచ్చింది. శ్రుతిక వాళ్ల అమ్మ ఉద్యోగం వదిలేసి మరీ తనకు అండగా నిలిచిందని తెలిపింది. అలాగే తన అభిమానులు కవిత, పాట, ఆటో వంటి బహుమతులు ఇచ్చారని, తనకు లవ్ ప్రపోజల్స్ రావడం కంటే తనను అందరూ అక్క అని పిలుస్తున్నారని పేర్కొంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాల కోసం ఈ కింది వీడియోను వీక్షించండి.
చదవండి: 'జీ సరిగమప'లో శృతిక గెలుచుకున్న ఖరీదైన బహుమతులు ఇవే..
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కట్టుకున్న ఈ చీర ధర ఎంతంటే?