‘ఐ హేట్ యు’ అంటున్న యంగ్‌ హీరో! | Sakshi
Sakshi News home page

‘ఐ హేట్ యు’ అంటున్న యంగ్‌ హీరో!

Published Sun, Jan 7 2024 5:27 PM

Young Hero Karthik Raju Starts New Movie Title As I Hate You - Sakshi

‘అథర్వ’ ఫేమ్ కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘ఐ హేట్ యు’. బి.లోకనాథం సమర్పణలో శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజి రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. 

ఈ సందర్బంగా..చిత్ర నిర్మాత నాగరాజ్ మాట్లాడుతూ ‘‘మా ‘ఐ హేట్ యు’ చిత్రం లవ్ సైకలాజికల్ చిత్రంగా ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. డిఫరెంట్ సబ్జెక్ట్‌తో డైరెక్టర్ అంజిరామ్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ సహా అందరూ నటీనటుల, టెక్నీషియన్స్ చక్కటి సహకారాన్ని అందించటంతో అనుకున్న ప్లానింగ్ ప్రకారం మూవీని పూర్తి చేశాం. అందరికీ థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. 

 
Advertisement
 
Advertisement