'యాత్ర-2' నుంచి మరో సాంగ్‌ విడుదల | Sakshi
Sakshi News home page

'యాత్ర-2' నుంచి మరో సాంగ్‌ విడుదల

Published Tue, Jan 30 2024 12:15 PM

Yatra 2 Tholi Samaram Song Released Now - Sakshi

యాత్ర -2 ఫిబ్రవరి 8న విడుదల కానున్నడంతో అభిమానులకు చిత్ర యూనిట్‌ మరో కానుక అందించింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌ తెలుగు ప్రేక్షకుల గుండెలను తాకింది. ఆ టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కొద్దిరోజుల క్రితం 'చూడు నాన్న' అనే  వీడియో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఆ పాట కూడా ప్రేక్షకులను మెప్పించింది.

తాజాగా 'తొలి సమరం' అనే సాంగ్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను గౌతమ్‌ భరధ్వాజ్‌ ఆలపించారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి గారి  పాత్ర‌లో జీవా చాలా అద్భుతంగా కనిపించారు.  ఈ పాటలో ఆయన పలికించిన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర-2 ఫిబ్రవరి 8న విడుదల కానుంది.  వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement